Message Scheduling: వాట్సప్ లో మెస్సేజ్ ఎలా షెడ్యూల్ చేయాలి..టైమ్ సెట్ చేస్తే చాలు..వెళ్లిపోతుందిక

  • Dec 12, 2020, 20:07 PM IST

ఐ ఫోన్ లో షార్ట్ కట్ యాప్స్ ద్వారా వాట్సప్ మెస్సేజ్ షెడ్యూల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ కు మాత్రం ధర్ట్ పార్టీ యాప్స్ అవసరం. 

ఒకవేళ మీరు అర్ధరాత్రి మేస్సేజ్ చేసి సర్ ప్రైజ్ చేయాలనుకుంటే..లేదా బర్త్ డే విషెస్ అందించాలనుకుంటే...అర్ధరాత్రి వరకూ మెళకువగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు వాట్సప్ లో మెస్సేజ్ ను షెడ్యూల్ చేయవచ్చు. నిర్ణీత సమయంలో మెస్సేజ్ దానికదే వెళ్లిపోతుంది. ఈ ఫీచర్ ను అధికారికంగా ప్రవేశపెట్టకపోయినా..ధర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం...

1 /5

ఆండ్రాయిడ్ లో మెస్సేజ్ షెడ్యూల్ కోసం అన్నింటికంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్ SKEDit ను డౌన్ లోడ్ చేసుకోండి. Signup చేసిన తరువాత మెయిన్ Menuలో ఇచ్చిన  whatsapp ఆప్షన్ ను ఎంచుకోండి. ఇప్పుడు మీరు కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

2 /5

ఇప్పుడు మీరు Enable Accessibility  ఆప్షన్ ను ఓకే చేయాలి. తరువాత  Use service పై ట్యాప్ చేేయాలి. ఇప్పుడు మీరు వాట్సప్ చాట్ పై మెస్సేజ్ ఎవరికి షెడ్యూల్ చేయనున్నారో వారి పేరు టైప్ చేయాలి. మెస్సేజ్ టైప్ చేయాలి. దాంతో పాటు మెస్సేజ్ డెలివరీ సమయం, తేదీ సెట్ చేయాల్సి ఉంటుంది.

3 /5

ఒకవేళ మీరు మీ షెడ్యూల్ మెస్సేజ్ ను రిపీట్ చేయాలనుకున్నా చేయవచ్చు. ఇక్కడ మీకు Ask me before sending ఆప్షన్ లభిస్తుంది. అవసరమైనవన్నీ నింపిన తరువాత.. OK ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు నిర్ణయించిన సమయానికి ఆటోమెటిక్ గా మెస్సేజ్ చేరిపోతుంది. 

4 /5

ఐ ఫోన్ లో Siri మరియు షార్ట్ కట్ యాప్స్ ద్వారా ఈ పని చేయవచ్చు. అన్నింటికంటే ముందు ఫోన్ దిగువభాగంలో ఇచ్చిన ఆటోమేషన్ ట్యాబ్ ను ఎంచుకుని...టాప్ లో రైట్ కార్నర్ లో ఉన్నటువంటి ఐకాన్ పై ప్రెస్ చేయండి. ఆ తరువాత  Create personal automation ట్యాప్ చేయండి. ఇప్పుడు సమయాన్ని షెడ్యూల్ చేయడానికి Time of Day ప్రెస్ చేయిండి. తేదీ సమయం సెలెక్ట్ చేయండి.  Next పై ప్రెస్ చేయండి.

5 /5

Add Action పై ప్రెస్ చేయండి. సెర్చ్ బార్ లో Text రాసి..లిస్ట్ లో Text ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మెస్సేజ్ టైప్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ దిగువన ఉన్న ఐకాన్ పై ప్రెస్ చేయండి . తరువాత వాట్సప్ సెర్చ్ చేయండి. ఇప్పుడు ఆప్షన్ లిస్ట్ లో Send Message via Whatsapp Next ను ఎంచుకోండి. కాంటాక్ట్ నెంబర్ సెలెక్ట్ చేసి..Next ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ మెస్సేజ్ నిర్ణీత సమయంలో ఆటోమేటిక్ గా వెళ్లిపోతుంది.