Know Who Can Get Benefits Of PM Kisan Scheme | పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని 1 డిసెంబర్ 2018 న ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ .6000ను 3 వాయిదాలుగా అందిస్తోంది. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి మధ్య కాలంలో రైతుల ఖాతాకు డబ్బు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 11.47 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
PM Kisan Samman Nidhi Rules Changed: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని 1 డిసెంబర్ 2018 న ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ .6000ను 3 వాయిదాలుగా అందిస్తోంది. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి మధ్య కాలంలో రైతుల ఖాతాకు డబ్బు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 11.47 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
రైతులకు భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన. బడ్జెట్లో దీనిపై అధిక నిధులు కేటాయిస్తారనుకుంటే అసలుకే ఎసరు పెట్టేలా పీఎం కిసాన్ సమ్మన్ నిధిలో కొత్త నియమాలు తీసుకొచ్చారు. గతంలో వచ్చిన కొందరికి ఈ పథకం ఇకనుంచి వర్తించదని తెలుస్తోంది. Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి
కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Samman Nidhi) కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేల నగదు పెంచకపోగా, కొత్త నియమాలు వచ్చాయి. దాని ప్రకారం కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇకనుంచి పీఎం సమ్మన్ నిధి పథకం ద్వారా ప్రయోజనం పొందాలంలే ఆ రైతు పేరు మీదనే పొలం ఉండాలి. ఆ రైతుల బ్యాంకు అకౌంట్ కచ్చితంగా ఆధార్ నెంబర్కు లింక్ చేసి ఉండాలి.
తల్లిదండ్రుల పేరు మీద ఉన్నా, ఇతరుల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని చేస్తున్నా ఇకనుంచి పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్ కింద ప్రతి ఏడాదికి వచ్చే రూ.6 వేలు రావు. ఒకవేళ అర్హున లబ్ది చెందే రైతు మరణిస్తే అతడి భార్య లేదా కుమారుడు, కుమార్తె ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. Also Read: PM kisan samman nidhi: మీ ఖాతాలో డబ్బులు చేరలేదా..ఇలా చేయండి చాలు
ప్రతినెలా రూ.10 వేలకు పైగా ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకునే వారు ఇంట్లో ఉంటే, ఆ రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు. కుటుంబ సభ్యులు రాజ్యంగబద్ధమైన పదవీలో కొనసాగుతుంటే వారిని సైతం అనర్హులుగా పరిగణిస్తారు.
ఇకనుంచి పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లోకి నగదు జమ కావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి దరఖాస్తులను వెరిఫై చేసి ఓకే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు తిరస్కరణకు గురైతే పీఎం కిసాన్ స్కీమ్ నగదు పథకం వర్తించకుండా చేస్తారు. Also Read: PM Kisan: రైతుల ఖాతాల్లోకి 18వేల కోట్లు.. విడుదల చేసిన ప్రధాని మోదీ