గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) చిత్రం తీసి వార్తల్లో నిలిచిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే మహిళా సంఘాల నుండి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. పోర్న్‌స్టార్ మియా మల్కొవాతో వర్మ తెరకెక్కించిన జీఎస్టీ చిత్రాన్ని ఇప్పటికే భారతదేశంలో నిషేధించారు. ఈ క్రమంలో పలువురు మహిళా సామాజికవేత్తలను కించపరిచేలా మాట్లాడారని వర్మ పై పలువురు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగా గురువారం తమ ఎదుట హాజరు కావాలని హైదరాబాద్ పోలీసులు రామ్‌గోపాల్‌వర్మకు నోటీసులు పంపారు. అయితే వర్మ ఆ నోటీసులు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. తాను ప్రస్తుతం ముంబైలో షూటింగ్లో బిజీగా ఉన్నానని.. తాను విచారణకు హాజరుకాలేనని తన లాయర్ ద్వారా ఆయన హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. వచ్చే వారం తనకు మళ్లీ నోటీసులు మంజూరు చేస్తే.. ఈ సారి తప్పక వస్తానని వర్మ పోలీసులకు సమాచారం అందించారు.
షూటింగ్లో బిజీ.. ఇప్పుడు రాలేను: వర్మ