Best Selling Cars: వినాయక చవితి, దసరా, దీపావళి. పండుగల సీజన్ ఇది. కొత్త వస్తువులు కొనాలనే సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కారణంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కార్ల అమ్మకాల్లో వృద్ధి కన్పిస్తోంది.
ఇండియాలో పండుగ సీజన్ అనేది వివిధ వ్యాపారాలకు కలిసొస్తుంటుంది. పండుగ సీజన్లో కంపెనీలు అందించే ఆఫర్లు కావచ్చు లేదా పండుగ వేళ కొత్త వస్తువు ఇంట్లో ఉండాలనే సెంటిమెంట్ కావచ్చు. ప్రస్తుతం వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. అందుకే ఆగస్టు నెలలో వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కార్ల అమ్మకాల్లో వృద్ది కన్పించింది.
దేశీయంగా ఆ సంస్థ అమ్మకాలు మాత్రం 6 శాతం తగ్గి 1 లక్షా 10 వేల 80 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించిందని కంపెనీ అంచనా వేస్తోంది.
ఇక మహీంద్ర అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగాయి. 15 వేల 973 యూనిట్లను అమ్మగలిగింది. థార్, ఎక్స్‌యూవీ 300, బొలేరో నియో, బొలేరో పిక్ ఆప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీ తెలిపింది.
కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధి సాధించాయి. ఆగస్టు నెలలో 16 వేల 750 యూనిట్లను విక్రయించింది. ఇదే కంపెనీ గత ఏడాది కేవలం 10 వేల 845 యూనిట్లే అమ్మగలిగింది. పండుగ సీజన్ సమీపిస్తుండంతో ఆటో కంపెనీలు స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో అంటే పండగ సమయంలో మరింతగా బుకింగ్స్ పెరగవచ్చని అంచనా ఉంది.
ఇక ఇదే నెలలో హ్యుండాయ్ కంపెనీ 12 శాతం వృద్ధి సాధించింది. మొత్తం 59 వేల 68 వాహనాల్ని విక్రయించింది. మరో ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ గత ఏడాది ఆగస్టులో 35 వేల 420 వాహనాల్ని విక్రయించగా..ఈ ఏడాది ఆగస్టు నెలలో మాత్రం ఏకంగా 53 శాతం వృద్ధి సాధించి 54 వేల 190 వాహనాల్ని విక్రయించగలిగింది.
ముఖ్యంగా మారుతీ సుజుకీ, హ్యుండయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హోండా కంపెనీలు కార్ల అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. ఏ కంపెనీ ఏ మేరకు అమ్మకాలు జరిపిందో తెలుసుకుందాం. మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు 5 శాతం పెరిగి 1 లక్షా 30 వేల 699 యూనిట్లకు చేరుకోగా..గత ఏడాది ఇదే నెలలో 1 లక్షా 24 వేల 624 వాహనాల్ని విక్రయించింది.