Costly Fish: ప్రపంచంలో రెండు రకాల చేపలుంటాయి. తినే చేపలు..అక్వేరియంలో పెంచుకునే చేపలు. ఏమైనా సరే చేపల కోసం మహా అయితే 5-10 వేల రూపాయలు ఖర్చు పెడతారు అంతేగా. అయితే ప్రపంచంలో కోట్లాది రూపాయల విలువ చేసే చేపలు కూడా ఉన్నాయి తెలుసా. అవేంటో తెలుసుకుందాం..
ఏరోవానా అనేది సాధారణ అక్వేరియం ఫిష్ కానే కాదు. ఇది దక్షిణ తూర్పు ఆసియాలో మాత్రమే లభిస్తుంది. ఇది దాదాపు 3 అడుగులు పొడుగుంటుంది. దీని విలువ ఎక్కువ కాబట్టి..దొంగలు కూడా ఎక్కువైపోయారు.
చైనా ప్రజలు ఈ చేప కోసం కోరిన డబ్బిచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ చేపలపై The Dragon Behind the Glassపేరుతో ఓ పుస్తకం కూడా ఉంది. ఈ పుస్తకంలో ఈ చేప గురించి పూర్తి వివరాలున్నాయి.
ఈ చేపలకు పెట్టే ఖర్చుతో మంచి బంగ్లా లేదా ఇళ్లు కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నారు కదా. నిజమే. చేపలపై ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అన్పిస్తుంది. కానీ ఏసియన్ ఏరోవానా చేప అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. చైనాలో ఈ చేపను స్టేటస్ సింబల్‌గా పరిగణిస్తారు.
ఈ చేపను కొనుగోలు చేసేందుకే కాదు..ఆ చేప రక్షణకు కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఈ చేపల రక్షణ కోసం గార్డుల్ని నియమిస్తుంటారు. ఆ అక్వేరియం కోసం ప్రత్యేక సెక్యురిటీ డిజైన్ చేస్తారు.
డ్రాగన్ చేప ప్రపంచంలోని ఖరీదైన చేపగా ఉంది. దీన్నే ఏసియన్ ఏరోవానా అని కూడా పిలుస్తారు. ఈ ఒక్క చేప 2-3 కోట్ల రూపాయలుంటుందట.