Bullet Train Proposals: ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, ముంబై-హైదరాబాద్ ప్రాజెక్టు వివరాలు

తెలుగు ప్రజలకు శుభవార్త. త్వరలోనే ప్రతిష్టాత్మక ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక భేటీ నేడు జరగనుంది. దేశంలో ప్రతిపాదిస్తున్న కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి.

Bullet Train Projects: తెలుగు ప్రజలకు శుభవార్త. త్వరలోనే ప్రతిష్టాత్మక ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక భేటీ నేడు జరగనుంది. దేశంలో ప్రతిపాదిస్తున్న కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి.

1 /5

ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కనీసం 15 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులో వస్తే ప్రయాణ సమయం కేవలం 3 గంటల 30 నిమిషాలకు పరిమితం కానుంది.  ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు కాగా..గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించేలా ట్రాక్ నిర్మిస్తారు. ఒకేసారి 350 మంది ఈ మార్గంలో ప్రయాణించవచ్చు.

2 /5

ఎన్‌‌హెచ్‌ఎస్‌ఆర్‌సి సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం ముంబై-హైదరాబాద్ వరకూ మొత్తం 717 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మితం కానుంది. ఈ మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. ముంబై, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్, పూణే, లోనావాలా, పండరీపూర్, షోలాపూర్ వంటి స్టేషన్లు ఉంటాయి. 

3 /5

దేశంలో ఇంకొన్ని ప్రాజెక్టులు చేపట్టాలనేది ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సి ఆలోచన. ఇందులో ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, చెన్నై-బెంగళురు-మైసూరు, ముంబై-హైదరాబాద్ మార్గాలున్నాయి. రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్ దూరాన్ని 4 వేల 109 కిలోమీటర్లకు పెంచాలనేది లక్ష్యంగా ఉంది. ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మధ్య దూరం 717 కిలోమీటర్లు కాగా, చెన్నై-బెంగళూరు-మైసూరు ప్రాజెక్టు మధ్య దూరం 435 కిలోమీటర్లుంది. ఇక ఢిల్లీ-వారణాసి మధ్య 865 కిలోమీటర్ల దూరం ఉండగా, ఢిల్లీ-అమృతసర్ మద్య 450 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక ఢిల్లీ -అహ్మదాబాద్ మధ్య 886 కిలోమీటర్ల దూరముంది.

4 /5

కొత్తగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా ఇండియాలో ముంబై-అహ్మదాబాద్ మద్య 508 కిలోమీటర్ల మేర ఇండియాలోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై - అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 

5 /5

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బుల్లెట్ ట్రైన్లు చాలా దేశాల్లో పరుగులెడుతున్నాయి. వీటిలో ఒకదానిమించిన మరొక రైళ్లున్నాయి. వేగంలో పోటీ పడుతూ ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడిప్పుడే బుల్లెట్ ట్రైన్స్ పనులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్ని వేగంగా నిర్మించేందుకు రైల్వేశాఖ నుంచి వేరు చేశారు.