లఖీంపూర్ ఘటనపై దేశం మొత్తం దృష్టి కేంద్రీకరించింది. లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా యూపీ నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు చెలరేగాయి. ఢిల్లీలోని యూపీ భవన్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున హంగామా సృష్టించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు కార్యకర్తల్ని అరెస్టు చేశారు.
Lakhimpur Kheri Protest: లఖీంపూర్ ఘటనపై దేశం మొత్తం దృష్టి కేంద్రీకరించింది. లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా యూపీ నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు చెలరేగాయి. ఢిల్లీలోని యూపీ భవన్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున హంగామా సృష్టించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు కార్యకర్తల్ని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ సైతం ఆందోళన చేపట్టింది. చండీగఢ్‌లోని రాజ్‌భవన్ వద్ద యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో నవజ్యోత్ సింగ్ సిద్దూ పాల్గొన్నారు. చండీగడ్ పోలీసులు సిద్ధూను అరెస్టు చేశారు.
లఖీంపూర్ ఖేరీలో రాజకీయ నేతల ప్రవేశంపై నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయి. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. యూపిలో సెక్షన్ 144 అమల్లో ఉంది.
లఖీంపూర్ ఖేరీ ఘటనకు పూర్తి బాధ్యత యూపీలోని యోగీ ప్రభుత్వానిదేనని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. లఖీంపూర్ వెళ్లకుండా విపక్షాల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. యూపీ పోలీసులతో దర్యాప్తులో న్యాయం జరగదన్నారు. విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
అటు రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మృతి చెందిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారం, గాయపడినవారికి 10 లక్షల పరిహారమిచ్చేందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు మృతి చెందిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రేతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకుపోయి నలుగురు రైతులు మరణించారు. ఈ ఘటనలో మృతి చెందిన రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన విపక్షనేతల్ని పోలీసులు అరెస్టు చేశారు.