Bit Coin Scam: బిట్ కాయిన్ కుంభకోణం కర్నాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన బిట్ కాయిన్ కుంభకోణంపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు అందింది..అసలేం జరిగింది.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో బిట్ కాయిన్ కుంభకోణం(Bit Coin Scam) ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక అధికార బీజేపీలో విభేధాలకు కారణమవుతోంది. బిట్‌కాయిన్ కుంభకోణంలో సొంత పార్టీ నేతలే విపక్షాలకు సమాచారం చేరవేస్తున్నారనే అనుమానం బీజేపీలో ఏర్పడింది. ఫలితంగా ఇద్దరు మంత్రుల కదలికలపై కేంద్ర బీజేపీ(Bjp) నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాల్సిన కొందరు మంత్రులే ప్రతిపక్షాలతో కుమ్మక్కైనట్లు బీజేపీ సందేహిస్తోంది. కర్ణాటక ముఖ్మమంత్రి స్వయంగా బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. బిట్‌కాయిన్‌పై సొంత పార్టీకు చెందిన ఇద్దరు మంత్రులు.. ప్రతిపక్ష నేతలకు లీక్‌లు ఇస్తున్నారని సీఎం బసవరాజ బొమ్మై పార్టీ అధినేత జేపీ.నడ్డా, హోం మంత్రి అమిత్‌షాకు(Amit Shah) ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన హై కమాండ్ ఇద్దరు మంత్రుల కదలికలపై నిఘాపెట్టడానికి రహస్య బృందాన్ని బెంగళూరుకు పంపించినట్లు తెలిసింది.
బిట్‌కాయిన్ స్కాంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే సమాచారాన్ని విపక్షాలకు ఆ ఇద్దరు మంత్రులు లీక్ చేస్తున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇటీవల హానగల్ ఉప ఎన్నిక సమయంలో విపక్షనేత సిద్దరామయ్య ఈ కేసును ట్విట్టర్ ద్వారా ప్రస్తావించిన తరువాత పెను దుమారం మొదలైంది. కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై(Karnataka cm Bommai) ఢిల్లీ పర్యటనలో మంత్రుల నిర్వాకంపై హైకమాండ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ లోని మంత్రుల మద్దతు లభించడం లేదనేది ప్రధాన ఆరోపణగా ఉంది.
Also read: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఖాళీ చేయాల్సిందే, ఇండియా వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
కర్ణాటక రాజకీయాల్లో బిట్ కాయిన్ కుంభకోణం ప్రకంపనలు, ఆ ఇద్దరు మంత్రులే కారణమా
కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్న బిట్ కాయిన్ కుంభకోణం
సొంత పార్టీకు చెందిన ఇద్దరు మంత్రులపై ముఖ్యమంత్రి బొమ్మై అధిష్టానానికి ఫిర్యాదు
విపక్షాలకు లీకులు ఇస్తున్నారని..సహకరించడం లేదని ఫిర్యాదు