Bipin Rawat Helicopter Crash Photos: బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాద దృశ్యాలు

భారత ఆర్మీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ 17 హెలీకాప్టర్ ఘోర ప్రమాదానికి లోనైంది. ప్రమాదంలో హెలీకాప్టర్ కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులున్నారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా..నలుగురి మృతదేహాలు కనుగొన్నారు. ఆ విషాద దృశ్యాలు ఇవే..

Bipin Rawat Helicopter Crash Photos: భారత ఆర్మీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ 17 హెలీకాప్టర్ ఘోర ప్రమాదానికి లోనైంది. ప్రమాదంలో హెలీకాప్టర్ కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులున్నారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా..నలుగురి మృతదేహాలు కనుగొన్నారు. ఆ విషాద దృశ్యాలు ఇవే..

1 /6

ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక ఉన్నారు. ఇంకా బ్రిగేడియర్ లిద్దర్, కల్నల్ హర్జిందర్ సింగ్, పీఎస్ఓలు గురుసేవక్ సింగ్, జితేంద్రకుమార్, వివేక్ కుమార్, సాయితేజ్, సత్పాల్ ఉన్నారు. ప్రమాదంపై వాయుసేన తక్షణ విచారణకు ఆదేశించింది.

2 /6

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎంఐ 17 హెలీకాప్టర్ తమిళనాడుకు చెందిన కూనూరు సమీపంలో కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. 

3 /6

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రమాద విషయాల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. 

4 /6

పోలీసుల్నించి అందిన సమాచారం ప్రకారం హెలీకాప్టర్ భారతీయ వాయుసేనకు చెందిన స్థావరం నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ కాలేజ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.

5 /6

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్వయంగా ట్వీట్ ద్వారా ఈ ప్రమాదం గురించి వివరించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంఐ 17వి5 హెలీకాప్టర్ తమిళనాడులో క్రాష్ అయిందని ట్వీట్ చేసింది. ప్రయాణ సమయంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. 

6 /6

తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్‌లో ప్రమాదం జరిగిన వెంటనే ఛాపర్ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కలంతా భారీగా పొగ వ్యాపించింది. అటవీ ప్రాంతలో ఈ ఛాపర్ కూలిపోయింది.