Vicky Katrina Wedding Venue: విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లి జరగబోయేది ఇక్కడే!

Vicky Katrina Wedding Venue: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మరికొద్ది గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబరు 8) హల్దీ వేడుక జరగనుంది. రాజస్థాన్ లోని 200 ఏళ్ల నాటి పురాతన కోట ఈ పెళ్లి వేడుకకు వేదిక కానుంది. దానికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

  • Dec 08, 2021, 14:48 PM IST

Vicky Katrina Wedding Venue: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మరికొద్ది గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబరు 8) హల్దీ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. విక్కీ – కత్రినా వివాహానికి రాజస్థాన్ లోని 200 ఏళ్ల నాటి ఓ కోట ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫొటోలను మీరూ చూసేయండి.

విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా – నిక్ జోసన్ ల వివాహాలను నిర్వహించిన ‘వెడ్డింగ్ స్క్వాడ్’.. విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లికి ఏర్పాట్లు చేయడం విశేషం.

(Pics courtesy: Instagram)

1 /5

విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ ల పెళ్లి వేడుక.. రాజస్థాన్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ కోటలో జరగనుంది.

2 /5

విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. అయితే వారి డేటింగ్, పెళ్లి వేడుక గురించి వారిద్దరూ ఇప్పటికీ బహిరంగ ప్రకటన చేయలేదు. పెళ్లి తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

3 /5

విక్కీ – కత్రినాల హల్దీ వేడుక కోసం వెడ్డింగ్ ప్లానర్స్ కోటను అందంగా ముస్తాబు చేశారు.

4 /5

రాజస్థాన్ లోని 200 ఏళ్ల నాటి పురతన కోట.. విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లికి వేదిక అయ్యింది.

5 /5

తన ఇంటికి రాబోయే కోడలు కోసం విక్కీ కౌశల్ తల్లి.. మహిళలతో ప్రత్యేక సంగీత్ ను నిర్వహించనున్నారని సమాచారం.