రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ నది ఒడ్డున ఒక బ్యాగు పోలీసుల కంటపడగా.. వారు దానిని తెరిచి చూశారు. అందులో నరికిన చేతులు కనబడడంతో వారు షాక్ తిన్నారు. దాదాపు 54 చేతులు బ్యాండేజీలు, గ్లౌజులతో చుట్టబడి ఉండడం చూసి విస్తుపోవడం పోలీసుల వంతైంది. ఈ పని ఎవరు చేసుంటారా? అన్న కోణంలో ఆలోచిస్తున్నారు పోలీసులు. ఏదైనా ఆసుపత్రి నుండి తీసుకొచ్చి ఆ బ్యాగును అక్కడ పడేశారా.. అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.
ఇదో మిస్టరీ కేసని.. ఆ చేతులపైనున్న వేలిముద్రలను పూర్తి స్థాయిలో సేకరిస్తే తప్పితే.. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే అవకాశం లేదని సైబీరియా పోలీసులు అంటున్నారు. సైబీరియా ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఆ చేతులు పాడవ్వలేదు. ప్రభుత్వానికి తెలియకుండా.. ఏవైనా వైద్య ప్రయోగాలు చేసే క్రమంలో ఈ చేతులు నరికారా? అన్న ప్రశ్న ప్రస్తుతం రష్యా మీడియాలో వ్యక్తమవుతుంది. గతంలో పలు భయానక సంఘటనలు సైబీరియా ప్రాంతంలో జరిగాయి. సాధారణంగా సైబీరియాలోని అమూర్ నది చేపలు పట్టే ఆసక్తి ఉన్నవారికి మంచి హాలీడే ప్రాంతం. అలాంటి పర్యాటక ప్రాంతంలో ఈ బ్యాగు దొరకడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఈ నది చైనా సరిహద్దుకి సరిగ్గా 20 మైళ్ళ దూరంలో మాత్రమే ఉండడం గమనార్హం.
Macabre bag containing 27 pairs of human hands found in bag on Amur River island. Mystery over who the hands belonged to, when they were chopped off, and why. GRAPHIC IMAGES https://t.co/eq2B1N1Pn9 pic.twitter.com/wJZqYveSPr
— The Siberian Times (@siberian_times) March 8, 2018
54 చేతులు నరికి నది పక్కన పడేశారు..!