/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

India Playing XI vs South Africa 2nd ODI: ఓటమితో వన్డే సిరీస్‌ను ఆరంభించిన భారత్ నేడు మరో పోరాటానికి సిద్ధమైంది. బొలాండ్ పార్క్ వేదికగానే ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA 2nd ODI) జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మొదటి మ్యాచ్ గెలిచి జోరుమీదున్న దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించాలంటే టీమిండియా.. అన్ని విభాగాల్లోనూ పుంజుకోవాల్సిందే. అంతేకాదు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) నాయకత్వం కూడా మెరుగుపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉన్న నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్‌ రాహుల్‌కు ఇది పెద్ద పరీక్షే అని చెప్పాలి. టెస్టు కెప్టెన్సీని ఆశిస్తున్న రాహుల్.. ఆ కోరిక నెరవేరాలంటే నాయకత్వ పటిమను తప్పక చాటుకోవాల్సివుంది. పార్ల్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

తొలి వ‌న్డేలో టాపార్డ‌ర్ రాణించిన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్ చేతులెత్తేయ‌డంతో భార‌త్ ఓట‌మి పాలైంది. అందుకే ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌పై భారత్ దృష్టి పెట్టింది. రిషబ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలకు తోడు వీరు కూడా గాడిలో పడితే..భారత్ భారీ స్కోర్ చేయొచ్చు. వెంక‌టేశ్ అయ్య‌ర్ ( Venkatesh Iyer) విఫలమవడంతో బెంచ్‌లో ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్‌ (Suryakumar Yadav), ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని జ‌ట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

Also Read: Malaika Arora Braless: బ్రాలెస్‌గా బయటికొచ్చేసిన మలైకా అరోరా.. ముంబై వీధుల్లో చక్కర్లు!!

ఇక బౌలింగ్‌లో ప‌లు మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. తొలి వ‌న్డేలో భారీగా పరుగులు ఇచ్చిన సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ స్థానంలో యువ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ (Mohammed Siraj) జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. సిరాజ్ ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తొలి వ‌న్డేలో విఫ‌ల‌మైన‌ మణికట్టు స్పిన్న‌ర్‌ యజువేంద్ర చహ‌ల్‌ స్థానంలో జ‌యంత్ యాద‌వ్‌ జ‌ట్టులో రానున్నాడు. చహ‌ల్‌ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. పార్ల్ పిచ్ నెమ్మదిగా ఉండడంతో పాటు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవ‌కాశాలే ఎక్కువ‌. భారీ స్కోర్లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

Also Read: TV Debate Woman Dance: టీవీ డిబేట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. ఓ మహిళ అందరి ముందే.. (వీడియో)!!

తుది జట్లు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్‌ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌/ఇషాన్ కిష‌న్‌, ఆర్ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్‌, జస్ప్రీత్ బుమ్రా, జ‌యంత్ యాద‌వ్‌.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్‌, జననేమన్ మలన్‌, తెంబా బవుమా (కెప్టెన్‌), ఐడెన్ మార్‌క్రమ్‌, రాస్సీ వాన్ డుస్సెన్‌, డేవిడ్ మిల్లర్‌, ఆండిలే ఫెలుక్వాయో, మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, లుంగీ ఎన్‌గిడి, తబ్రైజ్ షంసీ.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
India Playing XI vs South Africa 2nd ODI: Suryakumar Yadav in and Venkatesh Iyer out
News Source: 
Home Title: 

IND vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్! సూర్య ఇన్.. వెంకటేష్ ఔట్!!

IND vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్! సూర్య ఇన్.. వెంకటేష్ ఔట్!!
Caption: 
India Playing XI vs South Africa 2nd ODI: Suryakumar Yadav in and Venkatesh Iyer out (Source: Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

దక్షిణాఫ్రికాతో రెండో వన్డే

గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్

సూర్య ఇన్.. వెంకటేష్ ఔట్
 

Mobile Title: 
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. గెలుపే లక్ష్యంగా భారత్! సూర్య ఇన్.. వెంకటేష్ ఔట్!!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, January 21, 2022 - 10:52
Request Count: 
89
Is Breaking News: 
No