Pooja Hegde in Pink Saree: పొడుగు కాళ్ల సుందరి పూజా హగ్డే తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పింక్ కలర్ సారీలో చూడ్డానికి అచ్చు బుట్ట బొమ్మలానే ఉంది. చీరకట్టులో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పూజా హెగ్డే ధరించిన ఈ పింక్ సారీ దేవనాగరి బ్రాండ్‌కి చెందిన 'ఫస్చియా ఆర్గాంజా' .
పూజా హెగ్డే ధరించిన ఈ చీరపై రేషమ్ ఎంబ్రాయిడరీ ఆకట్టుకునేలా ఉంది. చీరపై పూజా మ్యాచింగ్ పింక్ బ్లౌజును ధరించింది. బ్లౌజుపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కూడా ఆకట్టుకునేలా ఉంది.
పూజా హెగ్డే ధరించిన ఈ చీర ధరెంతో తెలుసా... దీని ధర రూ.38 వేలు. దేవనాగరి వెబ్‌సైట్‌లో ఈ చీరలు అందుబాటులో ఉన్నాయి.
ట్రెడిషనల్ లుక్ అయినా.. మోడర్న్ లుక్ అయినా పూజా హెగ్డే ఔట్ ఫిట్స్ అందరినీ ఇట్టే ఆకట్టుకునేలా ఉంటాయి. పూజా అంటేనే స్టైల్ సింబల్.
తెలుగులో చిరంజీవి, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఆచార్య' చిత్రంలో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకు ముందుకు రానుంది.