అనుష్క శర్మకు 'దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు'

  • Apr 08, 2018, 15:55 PM IST
1 /5

బాలీవుడ్ నటి అనుష్క శర్మను త్వరలో 'దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్' అవార్డుతో సన్మానించబోతున్నారు. ఈ అవార్డును తన ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించిన సినిమాల కొరకు ఇస్తున్నారు. అనుష్క సినిమాలకు నిర్మాతలు సంతృప్తి చెందారు. ఇప్పటివరకు తన మూడు చిత్రాల ద్వారా పరిశ్రమలో వివిధ ప్రయోగాలు చేశారు. అందుకు అనుష్క కూడా చాలా ప్రశంసలు అందుకుంది.

2 /5

అనుష్క శర్మ 'క్లీన్ స్లేట్ ఫిలిమ్స్' ప్రొడక్షన్ హౌస్‌‌ను సోదరుడు కర్నేష్ శర్మతో ప్రారంభించారు. ప్రొడక్షన్ లో వచ్చిన తొలి సినిమా 'ఎన్‌హెచ్ 10'.  ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.

3 /5

అనుష్క 25 సంవత్సరాల వయస్సులో తన నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ సమయంలో, అనుష్క పరిశ్రమలో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆమె పరిశ్రమలో అతి పిన్నవయస్కురాలి నిర్మాతగా ప్రసిద్ధి.

4 /5

మా అనుబంధ వెబ్సైట్ డీఎన్ఏలో ప్రచురించబడిన ఒక వార్తా కథనం ప్రకారం, అనుష్క ప్రొడక్షన్ ప్రొడక్షన్‌ హౌస్‌లో నిర్మించిన  'ఎన్‌హెచ్ 10' , 'ఫిలౌరీ', 'పరీ' మూడు సినిమాలను పరిగణనలోకి తీసుకుని దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డుతో గౌరవించాలని నిర్ణయించుకుంది. అని తెలిపింది.

5 /5

థ్రిల్లర్, హర్రర్ మరియు కామెడీ హర్రర్ వంటి సినిమాలను ఇప్పటివరకు అనుష్క తన ప్రొడక్షన్‌ హౌస్‌లో నిర్మించారు. ఆమె ప్రొడక్షన్‌ హౌస్‌లో వచ్చిన చివరి చిత్రం 'పరీ'. ఇది కొన్నిరోజుల క్రితం విడుదలై విమర్శకుల ప్రశంసలను పొందింది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుణ్ ధావన్‌తో 'సుయ్‌‌ధాగా', షారుఖ్ ఖాన్ 'జీరో' చిత్రంలో అనుష్క త్వరలోనే కనిపించబోతున్నారు.