Smart Watch Tips: స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి

మార్కెట్‌లో వివిధ రకాల స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందుకే స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు తొందరపాటు పనికిరాదు. కొన్ని విషయాలు పరిశీలించకుండా కొంటే..డబ్బులు వృధా అవడం ఖాయం..

Smart Watch Tips: మార్కెట్‌లో వివిధ రకాల స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందుకే స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు తొందరపాటు పనికిరాదు. కొన్ని విషయాలు పరిశీలించకుండా కొంటే..డబ్బులు వృధా అవడం ఖాయం..

1 /5

సిలికాన్ స్ట్రాప్ అనేది చాలా ముఖ్యం. స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు సాధారణ స్ట్రాప్ లేకుండా చూసుకోవాలి. సిలికానా్ స్ట్రాప్ అయితే చేతికి సౌకర్యవంతంగా ఉంటుంది. 

2 /5

కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి స్మార్ట్‌వాచ్‌కు చాలా అవసరం. స్మార్ట్‌వాచ్‌లో కనెక్టివిటీ ఫీచర్లు బాగున్నాయా లేదా చూసుకోవాలి. కనెక్టివిటీ లేకుంటే కాల్ చేయలేరు. స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌వా‌చ్‌తో కనెక్ట్ చేయలేరు.

3 /5

ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ విఫలమౌతుంటాం. హెల్త్ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేస్తే ప్రయోజనముంటుంది.

4 /5

స్పోర్ట్స్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉండేవారు..స్పోర్ట్స్ యాక్టివిటీస్ ట్రాకర్ ఫీచర్ ఉందో లేదా చెక్ చేయాలి. ఈ ఫీచర్ కారణంగా మీరు ఎంత కేలరీలు బర్న్ చేశారు, ఫిట్నెస్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు.

5 /5

స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు ఎమోల్డ్ డిస్‌ప్లే ఉందో లేదో చెక్ చేయాలి. ఎమోల్డ్ డిస్‌ప్లేలో కలర్ పాప్ బాగుంటుంది. ఫలితంగా యూజర్లకు మెరుగైన విజ్యువల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఎమోల్డ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్ కాస్త ఖరీదైందిగా ఉంటుంది. కానీ ఆకట్టుకుంటుంది.