Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
Pension Rules: పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక. ఎందుకంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై అన్ని పెన్షన్ అప్లికేషన్స్ తప్పనిసరిగా పెన్షన్ ఫారమ్ 6ఏ ద్వారా ఆన్ లైన్ ల సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ లేదా e-HRMS 2.0 పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ హార్డ్ కాపీలను ఇకపై అంగీకరించరు. పెన్షన్ పాలసీలను డిజిటలైజ్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.
దీనికి సంబంధించి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్లు సంక్షేమ శాఖ ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గతంలో పెన్షన్ అప్లికేషన్ ఫామ్స్ పేపర్ పై జరుగుతుండేవి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
పదవీ విరమణ చేసే సిబ్బంది సౌలభ్యం కోసం గతంలో ఉన్న అన్ని రకాల పెన్షన్ ఫారమ్స్ కలిసి సింప్లిఫైడ్ పెన్షన్ ఫారమ్ 6ఏ ను తయారు చేశారు. దీనికి సీసీఎస్ లోని 53, 57, 58, 59,60 పెన్షన్ రూల్స్ సవరించారు.
వ్యయ శాఖ లా అండ్ జస్టిస్ డిపార్ట్ మెంట్, కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వంటి అన్ని శాఖల సలహా తర్వాత ఈ సవరణలు చేసినట్లు వెల్లడించింది.
నవంబర్ 16 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ పొందిన సిబ్బందికి ఇది అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 2024 నవంబర్ 4నే విడుదల అయ్యింది.
పెన్షన్ ప్రాసెస్ ను మరింత సమర్థవంతంగా సులభతరం చేసేందుకు ఈ ఆన్ లైన్ పోర్టల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల్లో భాగంగా పెన్షన్ ప్రాసెస్ లను సరిగ్గా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.