1081 special buses for Dussehra 2022 Festival in AP: దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబరు 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 1081 అదనపు బస్సులు నడుస్తాయని స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
విజయవాడ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలానే విజయవాడ నుంచి తిరుపతి, రాయలసీమకు.. విజయవాడ నుంచి అమలాపురం, భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయి. ప్రయాణికులకు టికెట్ రిజర్వేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక బస్సుల వివరాలు ఉంటాయి.
దసరా పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు ఇప్పటికే సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 6 వరకు జగన్ సర్కార్ పాఠశాలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 9 వరకు తెలంగాణలో విద్యార్థులకు సెలవులు ఉన్నాయి. 10 రోజులకు పైగా సెలవులు ఉండడంతో విద్యార్థులు సొంత ఊర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపనున్నారు.
Also Read: లేటు వయసులో ఘాటు అందాలు.. శారీలో రమ్యకృష్ణ గ్లామర్ ట్రీట్ పోలా అదిరిపోలా!
Also Read: Neha Malik Bikini Pics: నేహా మాలిక్ బికినీ ట్రీట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Dussehra APSRTC Buses: దసరాకు సొంత ఊరెళ్లే వారికి శుభవార్త.. సాధారణ ఛార్జీలే వసూల్!
దసరాకు సొంత ఊరెళ్లే వారికి శుభవార్త
1081 ప్రత్యేక బస్సులు
సాధారణ ఛార్జీలే వసూల్