Diwali Smartphones: దీపావళికి ముందే లాంచ్ కానున్న షియోమి, గూగుల్, మోటోరోలా స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు

దీపావళి మరి కొద్దిరోజుల్లో ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ సీజన్‌లో లాంచ్ కానున్న స్మార్ట్‌పోన్లలో గూగుల్, షియోమీ కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Diwali Smartphones: దీపావళి మరి కొద్దిరోజుల్లో ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ సీజన్‌లో లాంచ్ కానున్న స్మార్ట్‌పోన్లలో గూగుల్, షియోమీ కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

1 /5

Xiaomi 12T సిరీస్ స్మార్ట్‌ఫోన్ కోసం చాలాకాలంగా నిరీక్షిస్తున్నారు. అక్టోబర్ 4న అధికారికంగా లాంచ్ కానుంది. మ్యూనిచ్‌లో మద్యాహ్నం 2 గంటలకు లాంచ్ కానుంది. Xiaomi 12T సిరీస్‌లో వెనీలా, ప్రీ మోడల్ ఉన్నాయి.

2 /5

Motorola Moto G72 ఇండియాలో అక్టోబర్ 3న లాంచ్ కానుంది.  ఇందులో 6.55 ఇంచెస్ 10 బిట్స్ 120 హెర్ట్జ్ పోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జి99 ప్రోసెసర్ ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తోంది. 

3 /5

Infinix Zero Ultra అక్టోబర్ 5న లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 200 ఎంపీ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. 

4 /5

Google Pixel 7 Series స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 6న గూగుల్ ఈవెంట్‌లో లాంచ్ కానుంది. ఈవెంట్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో టెన్సార్ జి2 చిప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, ఆండ్రాయిడ్ 13, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి.  ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంది. 

5 /5

రానున్న కొద్దిరోజుల్లో మోటోరోలా, షియోమి, ఇన్‌ఫినిక్స్, గూగుల్ వంటి ఫోన్లు లాంచ్ కానున్నాయి. మోటోరోలా కేవలం ఇండియాలోనే లాంచ్ కానుంది. ఇతర బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఆ స్మార్ట్‌ఫోన్ల వివరాలు తెలుసుకుందాం.