ఉరుకులు పరుగుల జీవితంలో జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా గుండె రోగాలు వస్తుంటాయి. గుండె శరీరంలో అతి ముఖ్యమైన అంగం. అందుకే గుండెను పరిరక్షించుకోవల్సిన బాధ్యత ఉంది. తెలిసో తెలియకో చేసే తప్పులు ఆ గుండెను అనారోగ్యానికి గురి చేస్తాయి.
రోజువారీ జీవితంలో చాలా సార్లు అనారోగ్యకరమైన పదార్ధాలు తీసుకుంటుంటాం. ఇవి గుండె ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఇటు గుండెతో పాటు అటు శరీరంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అధిక కేలరీలు, సోడియం ఉండే ఆహార పదార్ధాల్ని దూరం పెట్టాలి. ఎందుకంటే ఇవి స్థూలకాయం, డయాబెటిస్, హృద్రోగం వంటి సమస్యలకు దారితీస్తాయి. ఈ వ్యాధుల్నించి దూరంగా ఉండాలంటే ఈ ఆహార పదార్ధాలను దూరంగా ఉంచాలి.
కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో మనిషి శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు, పండ్లలో కేలరీలు తక్కువగా ఉండి..ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ప్లాంట్ ఫుడ్స్ గుండె రోగాల్ని నియంత్రించడంలో దోహదపడతాయి. అందుకే మీ డైట్‌లో ఆకు పచ్చని కూరగాయల్ని చేర్చాలి.
ఇక తృణ ధాన్యాల్లో ఫైబర్ మోతాదు అధికంగా ఉంటుంది. ఇందులో పోషక పదార్ధాలు కూడా ఎక్కువే. బ్లడ్ ప్రెషర్, గుండె సంబంధిత వ్యాధుల్ని తగ్గిస్తాయి. ప్రోసెస్డ్ ఫుడ్‌ను దూరంగా పెట్టి..ఆ స్థానంలో తృణ ధాన్యాల్ని చేర్చాలి.
మీరు తినే ఆహారంలో ఉప్పు విషయంలో జాగ్రత్త అవసరం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు గురవుతారు. ఇది గుండెపోటు ముప్పును పెంచుతుంది. ఉప్పుు వాడకాన్ని తగ్గించడం ద్వారా వ్యాధుల్ని దూరం చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Healthy Heart: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..రోజూ ఇలా చేయండి