/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల వ్యాధుల్ని ఎదుర్కోవల్సి వస్తోంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు ఈ కోవకు చెందినవే. మరి వీటి నుంచి ఎలా కాపాడుకోవాలి.

మన అలవాట్లే మన శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. చెడు అలవాట్ల కారణంగా..గుండె సంబంధిత వ్యాధులకు బలవుతుంటారు. సరైన వ్యాయమం లేకపోవడం వల్ల కూడా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గుండె సంబంధిత వ్యాధుల్నించి దూరంగా ఉండాలనుకుంటే..కొన్ని అలవాట్లను ఇవాళే మీరు మార్చుకోవల్సి ఉంటుంది. జీవనశైలిలో ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలో తెలుసుకుందాం..

హార్ట్ ఎటాక్ నుంచి కాపాడుకునేందుకు మార్చుకోవల్సిన అలవాట్లు

ధూమపానానికి దూరం

గుండెను ఆరోగ్యంగా మార్చేందుకు ముందుగా ధూమపానం మానేయాలి. ఎందుకంటే సిగరెట్‌లో ఉండే టొబాకో ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది. అంతేకాకుండా..సిగరెట్ తాగడం వల్ల లంగ్స్ సంబంధిత వ్యాధులు వెంటాడుతాయి. ఒకవేళ మీరు కూడా స్మోకర్ అయితే వెంటనే సిగరెట్ మానేయాల్సి ఉంటుంది. 

వ్యాయామం జీవితంలో భాగం

ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడం చాలా అవసరం. రోజూ కనీసం 30 నిమిషాల యాక్టివిటీ శరీరానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే వ్యాయామం చేయడం వల్ల శరీరం బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామంతో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు కూడా దూరమౌతాయి.

తగినంత నిద్ర

ఆరోగ్యంగా ఉండేందుకు ముందుగా తగినంత నిద్ర చాలా అవసరం. దీనికోసం రోజుకు కనీసం 8 గంటలు నిద్ర ఉండాలి. నిద్ర సరిపడినంతగా ఉంటే..అధిక రక్తపోటు, డయాబెటిస్, డిప్రెషన్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు తగ్గుతాయి.

ఒత్తిడి నియంత్రణ

ఒత్తిడిని జయించడం లేదా నియంత్రించడం చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించేందుకు అనారోగ్యకరమైన డైట్, మద్యం, ధూమపానం పూర్తిగా వదిలేయాలి. అటు ఒత్తిడి తగ్గించేందుకు యోగా, మెడిటేషన్‌లను జీవితంలో భాగంగా చేసుకోవాలి.

Also read: Weight Loss Tips: బరువు తగ్గడానికి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని చిట్కాలు.. ఇలా చేస్తే 12 రోజుల్లో చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Health tips and precautions to check heart attacks, change these lifestyle habits today onwards
News Source: 
Home Title: 

Heart Attacks: ఈ అలవాట్లు మార్చుకుంటే..గుండెవ్యాధులు దూరం

Heart Attacks: ఈ అలవాట్లు మార్చుకుంటే..గుండెవ్యాధులు దూరం
Caption: 
Heart attack ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Heart Attacks: ఈ అలవాట్లు మార్చుకుంటే..గుండెవ్యాధులు దూరం
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, December 20, 2022 - 17:59
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
50
Is Breaking News: 
No