Fitness Tips: నెల రోజుల్లో ఫిట్ అండ్ స్లిమ్‌‌గా మారాలనుకుంటే...ఈ టిప్స్ పాటిస్తే చాలు

కొత్త ఏడాది మరి కొద్దిరోజులే మిగిలుంది. కొత్త ఏడాదిలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి..స్థూలకాయం నుంచి విముక్తి పొందాలనుకుంటే మీ కోసం మంచి టిప్స్ ఇస్తున్నాం. అవేమీ అసాధ్యమైనవి కావు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. కొన్ని రోజుల్లోనే అంటే కేవలం నెలరోజుల వ్యవధిలోనే అధిక బరువు నుంచి గట్టెక్కవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..

Fitness Tips: కొత్త ఏడాది మరి కొద్దిరోజులే మిగిలుంది. కొత్త ఏడాదిలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి..స్థూలకాయం నుంచి విముక్తి పొందాలనుకుంటే మీ కోసం మంచి టిప్స్ ఇస్తున్నాం. అవేమీ అసాధ్యమైనవి కావు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. కొన్ని రోజుల్లోనే అంటే కేవలం నెలరోజుల వ్యవధిలోనే అధిక బరువు నుంచి గట్టెక్కవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..
 

1 /5

ప్రతి రోజూ పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. రోజూ ఉదయం తప్పకుండా ఈ పద్ధతి ఫాలో కావాలి. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం లేదా తేనె కలుపుకుని కూడా తీసుకోవచ్చు.

2 /5

అదే పనిగా కూర్చుని ఉంటే బరువు పెరగడం ఖాయం. రోజూ కనీసం ఓ అరగంట వాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ప్రతిరోజూ ఇలా చేస్తే బరువు తగ్గడం ఖాయం

3 /5

షుగర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినకూడదు. ఒకవేళ బరువు తగ్గించుకోవాలనుకుంటే..స్వీట్స్ నుంచి దూరంగా ఉండాలి. బంగాళదుంప, బియ్యం కూడా తగ్గించాలి. 

4 /5

ఫిట్‌నెస్ కోసం ముఖ్యంగా కావల్సింది ఆరోగ్యమైన డైట్. ప్రతిరోజూ ఆయిలీ, ఫ్రైడ్, మసాలా లేదా జంక్ ఫుడ్స్ తినే అలవాటుంటే ఇవాళే వాటికి చెక్ పెట్టండి. అంతే బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. ఫ్యాట్ కారక పదార్ధాలు వదిలిపెడితే చాలా త్వరగా బరువు తగ్గించవచ్చు.

5 /5

బరువు తగ్గించుకునేందుకు జిమ్ వెళ్లడమే ముఖ్యం కాదు. ఫిజికల్ వర్కవుట్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంట్లోనే ప్రతిరోజూ 30-40 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేస్తే చాలు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.