IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే.. టీమిండియా నుంచి ఒక్కడే

Most Expensive Players in IPL: ఐపీఎల్ 2023 వేలంలో చాలా మంది వెటరన్ ప్లేయర్లు భారీ మొత్తాన్ని దక్కించుకున్నారు. అదే సమయంలో చాలా మంది స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఐపీఎల్ వేలం చరిత్రలో ఊహించని ధరకు కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇప్పటివరకు ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఐదుగురు ఆటగాళ్ల వీళ్లే.. 
 

  • Dec 23, 2022, 20:53 PM IST
1 /5

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా యంగ్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 13 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లిష్ జట్టును జగజ్జేతా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.  

2 /5

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రూ.17.50 కోట్లకు ముంబై ఇండియన్స్  కొనుగోలు చేసింది. కిల్లర్ బౌలింగ్‌తోపాటు డ్యాషింగ్ బ్యాటింగ్‌లో నైపుణ్యం సత్తాచాటగల ఆటగాడు.   

3 /5

గత కొంత కాలంగా బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుకు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో సూపర్ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు టైటిల్‌ అందించాడు . రూ.16.25 కోట్లకు ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.   

4 /5

ఐపీఎల్ హిస్టరీలో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అత్యంత ఖరీదైన ధర పొందిన ఆటగాళ్లలో ఒకడు. రూ.16.25 కోట్లకు 2021లో రాజస్థాన్ రాయల్స్ ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో మోరిస్ 81 మ్యాచుల్లో 95 వికెట్లు పడగొట్టాడు.  

5 /5

టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్టేలు. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఈ స్టార్ ఆటగాడిని రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.