Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి

Credit Card Tips: చాలామందికి క్రెడిట్ కార్డు పేరు చెప్పగానే.. అబ్బా అనవసరంగా తీసుకున్నా.. బిల్లులు కట్టలేక తలనొప్పి వస్తోందంటారు. క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడితే చాలా ఉపయోగాలు ఉంటాయి. అదే పొరపాటున కొంచెం అటు ఇటు అయినా.. వడ్డీలకు చక్రవడ్డీలు కట్టాల్సిందే. క్రెడిట్ కార్డును ఈ టిప్స్ ఉపయోగించి వాడితే మీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

  • Jan 14, 2023, 19:52 PM IST
1 /5

ప్రతి నెలా క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించండి. గడువు తేదీ ముగిసినా మీరు చెల్లించకపోతే.. భారీ జరిమానాలు ఉంటాయి. చివరి తేదీ వరకు ఆగకుండా ముందే బిల్లును చెల్లించండి.  

2 /5

మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ కంటే ఎక్కువ అస్సలు ఖర్చు చేయకండి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 20 నుంచి 30 శాతం మాత్రమే ఖర్చు చేసేలా చూసుకోండి. వృథా ఖర్చులు నివారించడంతో పాటు బిల్లు చెల్లించేందుకు సులభంగా ఉంటుంది.   

3 /5

క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉన్న చోటు ఉపయోగించండి. ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేయకండి.   

4 /5

మీ బిల్లులను చెల్లించడానికి ఆటోపేలో సెట్ చేసుకోండి. మీరు లాస్ట్ డేట్ మర్చిపోయినా.. ఆటో పే ద్వారా మీ బిల్లులు సకాలంలో చెల్లించవచ్చు. పెనాల్టీ నుంచి తప్పించుకుంటారు.

5 /5

నెల ప్రారంభంలో మీ ఖర్చులను అంచనా వేసుకోండి. మీరు ఏ పని కోసం ఎంత ఖర్చు చేయాలో రాసిపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాలనే ఆలోచన వస్తుంది. దీనివల్ల పొదుపు కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డును అనవసరమైన చోట వాడకండి.