Historical Forts: మన దేశంలో ప్రసిద్ధి చెందిన కోటలు.. ఒక్కసారైనా చూశారా..?

Best Tourist Places in India: మన దేశంలో అనేక పురాతన కోటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ కోటలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మీరు కూడా ఈ కోటలను చూడకపోతే.. ఇకనైనా చూసి అద్భుత అనుభూతిని పొందండి.
 

  • Mar 16, 2023, 02:13 AM IST
1 /6

హైదరాబాద్ నగరానికి తలమానికం.. నవాబుల ఖిల్లా గోల్కోండ కోట. మీరు ఒక్కసారి గోల్కొండ కోటను సందర్శిస్తే అద్భుత అనుభూతికి లోనవుతారు. హైదరాబాద్‌కు 11 కి.మీ దూరంలో గోల్కొండ కోట ఉంది.

2 /6

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఉన్న గ్వాలియర్ కోట చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కోటను రాజా మాన్‌సింగ్ తోమర్ నిర్మించారు. ఈ కోట గోడలు, ప్రాకారాలపై అందమైన వాస్తుశిల్పం, అద్భుతమైన శిల్పాలు, పెయింటింగ్, హస్తకళతో చాలా అందంగా కనిపిస్తుంది.  

3 /6

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఉన్న ఈ కోట చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. 2013లో యునెస్కో ఈ కోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ కోట 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ కోట 200డీ బెరాచ్ నది ఒడ్డున ఉంది.  

4 /6

ఆగ్రా కోటను యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ కోట వాస్తుశిల్పం, అందమైన రంగుల కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. నగరం మొత్తం కోట సరిహద్దు గోడ లోపల ఉంది. ఈ కోటను మొఘల్ పాలకుడు అక్బర్ చక్రవర్తి 1573లో నిర్మించాడు.  

5 /6

ఎర్రకోట ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ కోట ఢిల్లీలో ఉంది. ఈ కోటను తోమర్ రాజా అనంగ్‌పాల్ 1060లో నిర్మించారు. ఈ చారిత్రక కోటను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 

6 /6

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా కోట పురాతన కోటలలో ఒకటి. ఈ కోట బగంగా, మాంఝీ నదులపై ఉంది. మీరు ఈ కోటను ఒక్కసారైనా సందర్శించండి.