జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని ఆత్మ కారకుడిగా భావిస్తారు. గ్రహాలకు రాజు కూడా. సూర్యుడు మరో రాశిలో ఎప్పుడు ప్రవేశించినా అ సమయాన్ని సంక్రాంతి అంటారు. మీనరాశిలో సూర్యుడి గోచారం జరిగింది. మార్చ్ 15వ తేదీ ఉదయం 6 గంటల 13 నిమిషాలకు సూర్యుడి మీనరాశిలో ప్రవేశించాడు. మీనరాశి గురుగ్రహం రాశి. ఈ రాశిలో సూర్యుడి ప్రవేశంతో చాలా రాశులకు ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Surya gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని ఆత్మ కారకుడిగా భావిస్తారు. గ్రహాలకు రాజు కూడా. సూర్యుడు మరో రాశిలో ఎప్పుడు ప్రవేశించినా అ సమయాన్ని సంక్రాంతి అంటారు. మీనరాశిలో సూర్యుడి గోచారం జరిగింది. మార్చ్ 15వ తేదీ ఉదయం 6 గంటల 13 నిమిషాలకు సూర్యుడి మీనరాశిలో ప్రవేశించాడు. మీనరాశి గురుగ్రహం రాశి. ఈ రాశిలో సూర్యుడి ప్రవేశంతో చాలా రాశులకు ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
వృషభ రాశి ఈ రాశి ఏకాదశి అంటే 11వ పాదంలో సూర్యుడి గోచారమైంది. ఫలితంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. పెట్టుబడులకు మంచి సమయం. జీవితంలో ఆనందం అన్నీ ఉంటాయి.
వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి ఈ గోచారం చాలా అదృష్టంగా ఉంటుంది. సూర్యుడు 5వ బాదంలో గోచారంతో మీ వ్యాపారం, చదువుకు సంబంధించిన పనుల్లో ప్రయోజనం కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి సూర్యుడి గోచారంతో కేవలం సుఖ సంతోషాలు లభించడమే కాకుండా పెళ్లి జీవితం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది.
మీనరాశి ఈ గోచారం శుభ పరిణామంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభవార్త లభిస్తుంది.
తులా రాశి సూర్యుడి ఆరవభాగంలో గోచారం. ప్రత్యర్ధులు కూడా మిమ్మలి ఏం చేయలేరు. అత్యంత శుభ పరిణామాలు కలుగుతాయి. కెరీర్ అభివృద్ధి చెందుతుంది.
మిధున రాశి ఈ రాశి 10వ పాదంలో సూర్యుడి గోచారముంది. ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనిచేసేచోట మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు లభిస్తాయి.
కర్కాటక రాశి సూర్యుడు ఈ రాశి 9వ పాదంలో గోచారం చేశాడు. ఈ రాశి పరివర్తనం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం పూర్తిగా తోడుంటుంది. ఆర్ధికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభం కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది.
కుంభరాశి ఈ రాశి రెండవ పాదంలో సూర్యుడి గోచారంతో ఉద్యోగులకు మంచి ఫలితాలుంటాయి. కుటుంబంలో పరిస్థితులు ఆనందంగా ఉంటాయి.