Maruti Suzuki Fronx Price: మారుతి సుజుకి ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి లాంచ్ చేసిన ఫ్రాంక్స్ ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. SUV మోడల్ తరహాలో ఉన్న ఈ కారు లుక్ బాలెనోకు, మినీ గ్రాండ్ వితారాకు మధ్య రకంలా కనిపిస్తుంది.
Maruti Suzuki Fronx Price, Mileage & Features: మారుతి సుజుకి బలెనో డిజైన్ ఆధారంగా తయారైన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో ఒక ఎస్యువి కారుకు ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యువి రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజన్ ద్వారా 89bhp , 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. రెండోది 1.0-లీటర్ K-సిరీస్ టర్బో పెట్రోల్ ఇంజన్ కారు. 99bhp సామర్థ్యంతో 147.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇండియన్ రోడ్స్ పై సందడి చేయనున్న ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్ కారుకి గట్టి పోటీని ఇస్తుందని మారుతి సుజుకి భావిస్తోంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ముందు భాగంలో అమర్చిన గ్రిల్స్, LED హెడ్ ల్యాంప్స్, DRLs ఆకట్టుకునేవిగా ఉన్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఇంటీరియర్స్ చూస్తే మారుతి వితారా బ్రెజ్జాలోని బ్లాక్ అండ్ వైన్ థీమ్ గుర్తుకొస్తుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో 308 litre బూట్ స్పేస్, బాలెనో తరహాలో విశాలమైన లెగ్ రూమ్ సౌకర్యం ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో 1.2 లీటర్, 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో మాన్వల్, ఏఎంటీ, ఏటీ గేర్‌బాక్సులో వేరియంట్స్‌లో లభిస్తోంది.
సబ్-కాంపాక్ట్ SUVలను టార్గెట్ చేసుకుని వచ్చిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మార్కెట్లోకి వస్తే.. టాటా పంచ్ లాంటి కార్ల సేల్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు వెనుక భాగం లుక్ సైతం SUV లవర్స్‌ని టెంప్ట్ చేసేదిలానే ఉంది.
ఫ్రాంక్స్ కారు ధర, మైలేజ్, ఇంజన్, ఫీచర్స్.. దర్జాలో రారాజు.. ఫోటోలు చూస్తే ఫిదా