White Hair To Black Oil with Aloe Vera Gel Coconut Olive Oil: జుట్టు ఆరోగ్యంగా, నల్లగా కనిపించడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల సులభంగా జుట్టు మెరుస్తూ మృదువుగా కనిపిస్తుంది.
White Hair To Black with Aloe Vera Gel Coconut Olive Oil: వాతావరణంలోని తేమలో మార్పుల కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. జుట్టు అందహీనంగా, రాలిపోవడం, నిర్జీవంగా తయారవుతుంది. అంతేకాకుండా కొందరిలో తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది చిట్కాలను పాటించండి.
చిట్లిపోయిన జుట్టు సమస్యలతో బాధపడేవారు పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
జుట్టు నిర్జీవంగా, కూరుకుపోయినట్లు ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమస్యలున్నవారు పెరుగును జుట్టుకు పట్టించాల్సి ఉంటుంది.
అలోవెరా జెల్‌తో కూడా తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు సమస్యలు దూరమవుతాయి.
పెరుగు హెయిర్ మాస్క్‌ను వినియోగించడం వల్ల జుట్టు మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ హెయిర్ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
స్నానానికి 1 నుంచి 2 గంటల ముందే జుట్టుకు కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లను అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అయితే నూనెలను అప్లై చేసిన తర్వాత తేలికగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది.