జపాన్ లోని ఒక ప్రాంతంలో తవ్వకాలు జరపగా అక్కడ 1500 అస్థిపంజరాలు బయపడ్డాయి.
మీజేజీ కాలం నాటివి అని చెప్పబడే ఈ అస్థిపంజరాలు.. అక్కడే ఉన్న 7 స్మశాన వాటికలో ఖననం చేసినవట. 1850-1860లో జపాన్ లో ఉన్న మీజేజే పాలనలో అక్కడే మొత్తం 7 స్మశాన వాటికలు ఉండేవి అని... పరిశోధకులు కనుగొన్న అస్థిపంజరాల్లో 350 మనుషలవి అని తెలిపారు.. మిగితావి జంతువులవి అని వెల్లడించారు.
ఈ స్మశానంలో ఖననం అయిన వ్యక్తుల గురించి పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వీరికి ఏదో అంటు వ్యాధి సోకడం వల్ల వీరు మరణించి ఉంటారు అని దానికి సాక్ష్యంగా వారి చేతులు కాల్లపై ఉన్న గుర్తులే చూపిస్తున్నారు.
ఒసాకా ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిగాయి. పరిశోధకులు ఈ అస్థిపంజాల గురించి మాట్లాడుతూ అతి భయంకరమైన వ్యాధి ఏదో సోకడం వల్ల రెండు మూడు శవాలను ఒకే చోట తక్కువ సమయంలో పాతి పెట్టి వెళ్లారని అంటున్నారు.