AP Sankranti Holidays: త్వరలో కొత్త సంవత్సరం రానుంది. మొదట వచ్చే పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను మూడు రోజులుపాటు నిర్వహిస్తారు. అయితే, సంక్రాంతికి స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ప్రభుత్వం కుదించనుందని ఈ మధ్య బాగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా సెలవులు అంటేనే విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. నిత్యం క్లాస్ వర్క్, హోమ్ వర్క్, స్పెషల్ క్లాసులతో తీవ్రంగా ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఉపశమనం అందిస్తాయి.
ఈ ఏడాది స్కూళ్లకు భారీగానే సెలవులు వచ్చాయి. మొదట బంగాళాఖాతంలో అల్పపీడనాల వల్ల రెండు నెలల కిందటి నుంచే సెలవులు ఆయా ప్రాంతాలను పరిస్థితులను బట్టి కూడా పాఠశాలలకు సెలవులు ఇచ్చాయి.
అయితే, దసరా సందర్భంగా కూడా దాదాపు 13 రోజులు, దీపావళికి 2 రోజులు అలా రెండేసి రోజులు సెలవులు వస్తూనే ఉన్నాయి. తాజాగా క్రిస్మస్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటించాయి.
అయితే, ఈరోజు కూడా దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయినందుకు ఒకరోజు అదనంగా సెలవు వచ్చింది.
ఇక క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు అయితే, ఏకంగా కొత్త సంవత్సరం ఒకటో తేదీ వరకు సెలువులు అంటే దాదాపు పది రోజులు ఇచ్చాయి. అయితే, ఇన్ని సెలవులు వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి సెలవులు కుదిస్తారు అనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై నేడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
సంక్రాంతి సెలవుల కుదింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఉంటాయని ఎస్పీఈఆర్టీ పేర్కొంది.
ఇక ఈ సెలవులపై ఏమైనా మార్పు ఉంటే అధికారిక ప్రకటన ముందుగానే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, గతంలో ఈ సంక్రాంతి సెలవులు కుదించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.