Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ బిల్డింగ్.. సూరత్ డైమండ్ బోర్స్‌ ప్రత్యేకతలు ఇవే..!

Surat Diamond Bourse Full Details in Telugu: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్‌ బిల్డింగ్‌ సూరత్ డైమండ్ బోర్స్‌ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారిభంచారు. అంతర్జాతీయ వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ఆధునిక హబ్‌గా నిలవనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సూరత్‌ కేంద్రంగా ఉన్న వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. సూరత్ డైమండ్ బోర్స్‌ (ఎస్‌డీబీ)తో మరో 1.5 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించనుందన్నారు. ఈ భవనం ప్రత్యేకతలు ఇలా..
 

  • Dec 17, 2023, 20:15 PM IST
1 /6

ఈ సముదాయం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించగా.. 65 వేల మంది వ్యాపారాలు చేసుకునేలా  కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు 700 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి చేశారు.  

2 /6

గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి దగ్గరలో ఉన్న ఖాజోడ్‌ గ్రామంలో ఈ బిల్టింగ్‌ను నిర్మించారు. 4,200కి పైగా వర్క్‌ప్లేస్‌లు ఉన్నాయి. ఒక్కో ఆఫీసు 300 నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉన్నాయి. తొమ్మిది టవర్లు.. ఒక్కొక్కటి 15 అంతస్తులతో ఉన్నాయి.  

3 /6

డైమండ్ ల్యాబ్, వజ్రాలు, పాలిష్ చేసిన వజ్రాల అమ్మకం, వజ్రాల తయారీలో ఉపయోగించే పరికరాలు, డైమండ్ ప్లానింగ్ కోసం సాఫ్ట్‌వేర్, డైమండ్ సర్టిఫికెట్ కంపెనీలతో సహా అన్ని వజ్రాల సంబంధిత కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలకు ఎస్‌డీబీ నిలయంగా మారనుంది.  

4 /6

వేలం పద్ధతిలో ఇక్కడ కార్యాలయాలను కేటాయించగా.. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న అనేక మంది వ్యాపారస్తులు ఇక్కడ తమ సంస్థలను ప్రారంభించనున్నారు.  

5 /6

 2015 ఫిబ్రవరిలో అప్పటి గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ పటేల్‌ ఎస్‌డీబీకి భూమిపూజ చేయగా.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.   

6 /6

దాదాపు రూ.3,200 కోట్లతో నిర్మించారు. 4 వేల సీసీ కెమెరాలు, స్మార్ట్ గేట్లను ఏర్పాటు చేశారు.