Rashmika Mandanna Marriage: మ్యారేజ్‌ లైఫ్‌పై రష్మిక కామెంట్స్.. విజయ్ దేవరకొండేనా వరుడు.. ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసింది..

Rashmika Mandanna And Vijay Devarakonda Marriage Pics: వరస సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా బిజీ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌ హీరోయిన్స్‌తో పాటు టాలీవుడ్‌ బడా హీరోయిన్స్‌కి మించి ఎదిగిపోయింది. అయితే పుష్ప 2 సినిమాతో ఈ కన్నడ భామ రేంజ్‌ విపరీతంగా పెరిగిపోంది. ప్రస్తుతం సిమాల్లో కొంతమంది హీరోయిన్స్‌ కేవలం ఐటమ్‌ సాంగ్స్‌, వేరే ఇతర పాత్రలకు వాడుకుంటున్న కొంతమంది దర్శకులు.. రష్మికను మాత్రం మంచి ప్రధాన్యత గత పాత్రల్లో చూపిస్తూ ఆమె తిరుగులేదని నిరూపించారని టాలీవుడ్‌లోఓ టాక్.. ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. 
 

1 /7

కన్నడ భామ రష్మిక మందన్న కిరాక్‌ పార్టీతో మొదట సినీ ప్రవేశం చేసి.. ప్రస్తుతం ఆమె తిరుగులేని హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. చిన్న పెద్ద సిమాలు అని తేడా లేకుండా ప్రతి మూవీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు డైరెక్ట్‌గా నేషనల్‌ క్రష్‌గా ఎదిగింది.    

2 /7

అలాగే రష్మిక మందన్నకు తెలుగులో వచ్చిన గీతా గోవిందం, భీష్మ, ఛలో సినిమాలో ఇండస్ట్రీలో మంచి పునాదులు వేసుకుంది. ఈ మూవీస్‌తో తెలుగు, తమిళం అని తేడా లేకుండా వివిధ భాషలకు కూడా సరిపోతుందని నిరూపించుకుంది.    

3 /7

కొన్ని సినిమాలతో రష్మికకు మంచి పేరు రావడంతో ఆమెకు బాలీవుడ్‌ ఛాన్స్‌లు కూడా క్యూ కట్టాయి. అలాగే బాలీవుడ్‌ బాడా అమితాబ్ బచ్చన్‌తో కూడా నటించే అవకాశం దక్కింది. ఆమె ఇలా మంచి మంచి ఛాన్స్‌లతో ప్రస్తుతం దూసుకుపోతోంది..    

4 /7

ఇటీవలే విడుదలైన సీక్వెల్‌ మూవీ పుష్ప 2తో రష్మిక మందన్నకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా రికార్డుల పరంగా దుమ్ము లేపడంతో హీరో అల్లు అర్జున్‌తో పాటు రష్మికకు కూడా మంచి పేరు లభించింది.     

5 /7

ఈ పుష్క 2 ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక మందన్నకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్‌ ఆమెను అడిన కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో నెటిజన్స్‌కు ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది.     

6 /7

ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పెళ్లికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇందులో ప్రేమ, వైవాహిక జీవితానికి సంబంధించిన కీలక విషయాలను కూడా చెప్పుకొచ్చారు. మనతో ఉన్న భాగస్వామి ఎవరైనా కష్టం, సుఖం లేడా లేకుండా జీవితంలో అన్ని దశలో ఉండాలని తెలిపింది.  

7 /7

అలాగే తనకు కాబోయే భర్త కూడా మంచి మనసు కలిగి వ్యక్తై ఉండాలని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాకుండా లవ్‌లో ఉండడం అంటే జీవితంలో మంచి భాగస్వామిని కలిగి ఉండడమేనని ఆమె పేర్కొంది. అయితే ఇలా చేసిన కామెంట్స్‌పై కొంతమంది నెటిజన్స్‌ స్పందించి.. పెళ్లికి మంచి భాగస్వామి విజయ్ దేవరకొండ కంటే ఎవరు మీకు సరిపోరని అంటున్నారు.