Yoga for PCOD: పీసీఓడీ లక్షణాల్నించి గట్టెక్కించి 5 అద్భుత ఆసనాలు, ఎలా వేయాలంటే

మహిళల్లో కామన్‌గా కన్పించే సమస్య పీసీఓడీ. అంటే పోలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇదొక హార్మోన్ సంబంధిత సమస్య. ఈ సమస్య ఉత్పన్నమైతే బరువు పెరగడం, పీరియడ్స్ క్రమం తప్పడం, విసుగు, మూడ్ స్వింగ్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో పీసీఓడీ సమస్యను తగ్గించేందుకు 5 యోగాసనాలు అద్భుతంగా ఉపయోగపడనున్నాయి. అవేంటో ఎలా వేయాలో తెలుసుకుందాం...

Yoga for PCOD: మహిళల్లో కామన్‌గా కన్పించే సమస్య పీసీఓడీ. అంటే పోలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇదొక హార్మోన్ సంబంధిత సమస్య. ఈ సమస్య ఉత్పన్నమైతే బరువు పెరగడం, పీరియడ్స్ క్రమం తప్పడం, విసుగు, మూడ్ స్వింగ్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో పీసీఓడీ సమస్యను తగ్గించేందుకు 5 యోగాసనాలు అద్భుతంగా ఉపయోగపడనున్నాయి. అవేంటో ఎలా వేయాలో తెలుసుకుందాం...

1 /5

శవాసనం శవాసనం వేయడం వల్ల పీసీఓడీ కారణంగా తలెత్తే మానసిక ఒత్తిడి దూరమౌతుంది. దీనికోసం వీపుపై పడుకోవాలి. కాళ్లను కొద్దిగా చాచాలి. చేతుల్ని శరీరానికి ఆన్చి నిటారుగా నేలపైకి ఉంచాలి. ఇలాగే ఉండి శ్వాశ దీర్ఘంగా తీసి వదలడం చేయాలి. ఇలా 5-10 నిమిషాలు చేయాలి

2 /5

బాలాసనం పీసీఓడీ సమస్యకు బాలాసనం మంచి పరిష్కారం. ఇది ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. దీనికోసం మోకాళ్లపై కూర్చుని శరీరాన్ని ముందుకు వంచాలి. రెండు చేతుల్ని ముందుకు నేలపైకి చాచాలి. ఇలా 5-10 నిమిషాలు ఉండి శ్వాస దీర్ఘంగా తీసుకుని వదలడం చేయాలి\

3 /5

త్రికోణాసనం ఈ ఆసనం హిప్స్, నడుము ప్రాంతంలో స్ట్రెచ్‌నెస్ కల్గిస్తుంది. శరీరాన్ని బలోపేతం చేస్తుంది. పెల్విక్ ఏరియాలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. దీనికోసం రెండు కాళ్లను చాపి నిలుచోవాలి. ఒక చేతిని నేలపై ఆన్చి రెండో చేతిని పైకి లేపాలి. ఇలా కాస్సేపు ఉండి తిరిగి రివర్స్ చేయాలి.

4 /5

వజ్రాసనం ఈ ఆసనంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒత్తిడి దూరమౌతుంది. పీసీఓడీ లక్షణాలను తగ్గిస్తుంది. దీనికోసం మోకాళ్లపై కూర్చుని కాలి పాదాలు నిటారుగా పెట్టాలి. చేతులు మోకాళ్లపై ఉంచటాలి. ఇప్పుడు కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా 5-10 నిమిషాలు ఉండాలి.

5 /5

భుజంగాసనం భుజంగాసనం వేయడం వల్ల పీసీఓడీ రోగులకు ఉపయోగం ఉంచటుంది. ఈ ఆసనం శరీరంలోపలి అవయవాలను బలోపేతం చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేసేందుకు పొట్టపై బోర్లా పడుకుని చేతుల్ని భుజాలకు ఆన్చి ఉంచి..నెమ్మదిగా చేతులపై శరీరం ఎగువ భాగాన్ని పైకి లేపుతూ స్ట్రెచ్ చేయాలి. మెడ వెనక్కు వంచాలి. ఇలా కాస్సేపు ఉండి తిరిగి మామూలు స్థితికి రావాలి. ఇలా 3-4 సార్లు చేయాలి