5 Best Vegetables: ఒంట్లో గ్యాస్, ఎసిడిటీ పెరిగిపోతున్నాయా, ఈ 5 కూరగాయలు ట్రై చేయండి

సీజన్ మారినప్పుుడు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కడుపులో మంట, ఎసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. సీజన్ మారిన ప్రతిసారీ జీర్ణవ్యవస్థ బలహీనమౌతుంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరంం. కొన్ని రకాల కూరగాయలు ఇందుకు ఉపయోగపడతాయి.  జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేసే 5 కూరగాయలేవో తెలుసుకుందాం.

5 Best Vegetables: సీజన్ మారినప్పుుడు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కడుపులో మంట, ఎసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. సీజన్ మారిన ప్రతిసారీ జీర్ణవ్యవస్థ బలహీనమౌతుంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరంం. కొన్ని రకాల కూరగాయలు ఇందుకు ఉపయోగపడతాయి.  జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేసే 5 కూరగాయలేవో తెలుసుకుందాం.

1 /5

పాలకూర పాలకూర జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపును క్లీన్ చేసి ఎసిడిటీ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. 

2 /5

క్యారట్ క్యారట్‌లో సహజసిద్ధంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు ఉపయోగపడతాయి. ఫలితంగా కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమౌతాయి. 

3 /5

క్యాబేజ్ క్యాబేజ్ ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను పటిష్టం చేస్తుంది. కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్య తలెత్తకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి

4 /5

కీరా కీరా కడుపుకు చాలా మంచిది. ఇది కూడా చలవ చేస్తుంది. వాటర్ కంటెంట్ అధికంగా ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని విష పదార్ధాలను బయటకు తొలగిస్తుంది.

5 /5

ఆనపకాయ ఆనపకాయ తేలిగ్గా జీర్ణమయ్యే కూరగాయ. ఇది ఒంటికి చలవ చేస్తుంది. కడుపులో మంటను దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ిందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఎసిడిటీ నియంత్రణలో ఉంటుంది.