7Th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం ఊహించని సర్‌ప్రైజ్.. రూ.30,000 జీతం ఉంటే మరో 4 వారాల్లో ఎంత డీఏ పెరుగుతుంది?

7Th Pay Commission Big Update On DA Hike: సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌ ఉద్యోగులు ఎన్నో రోజులుగానో ఎదురు చూస్తున్న శుభ తరుణం అతి దగ్గరలో ఉంది. అదే డీఏ పెరుగుదల. దీంతో వారి జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. అక్టోబర్‌లో డీఏ గురించిన గుడ్‌న్యూస్‌ కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. గత ఏడాది కూడా అక్టోబర్‌ మొదటి వారంలోనే డీఏ హైక్‌ ప్రకటించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డీఏ ఈ ఏడాది 3-4 శాతం పెరగనుంది. ఇది దీపావళికి ముందుగానే ప్రకటించనున్నారు.
 

1 /5

యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌ దీపావళికి ముందే ఉద్యోగులకు 7వ వేతన సంఘం గురించి ఓ బిగ్‌ అప్డేట్‌ ఇవ్వనున్నారు. ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగనుంది. దీంతో 15 లక్షల మంది ఉద్యోగులు, 8 లక్షల మంది పెన్షనర్లకు డీఏ ఏకంగా 4 శాతం పెరగనుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ డీఏ గురించిన అధికారిక ప్రకటన అతి త్వరలో చేయనుంది.  

2 /5

ఈ డీఏ పెరుగుదలతో ఉత్తర ప్రదేశ్‌లోని 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.  గత ఏడాది రూ.7000 బోనస్‌గా ప్రతి ఉద్యోగికి అందించగా, ఈ ఏడాది మరికాస్త పెరిగే అవకాశం ఉంది.  

3 /5

ఇక రానున్న 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఏకంగా 64 శాతం డీఏ పెంచాలని నిర్ణయం తీసుకుందట.    

4 /5

శాలరీ ఎంత పెరుగుతుంది? ఒక వేళ ఉద్యోగి జీతం  నెలకు రూ.30,000 అయితే, బేసిక్‌ శాలరీ రూ. 18000. ఆ ఉద్యోగి డీఏ రూ.9000 పొందుతాడు, అంటే బేసిక్‌ పే లో 50 శాతం. ఈ 3 శాతం పెరుగుదలతో ఉద్యోగికి రూ.9,540 ప్రతి నెల పొందుతారు. ఒకవేళ డీఏ 4 శాతం పెరిగితే రూ.9,720 నెలకు పెరుగుతుంది.  

5 /5

ప్రభుత్వ ఉద్యోగులు డీఏ అందుకుంటారు. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అంటే పెన్షనర్లు డీఆర్‌ తీసుకుంటారు. ప్రతి ఏడాది ఈ రెండిటిని రెండు సార్లు పెంచుతారు. జనవరి, జూలై నెలల్లో ఉంటుంది.  ప్రస్తుతం కోటీ పైగా ఉద్యోగులు, పెన్షనర్లు 50 శాతం డీఏ పొందుతున్నారు.