Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో రకుల్.. ఆశ్చర్యపోతున్న ఫాన్స్..!

Rakul Preet Singh recent photos: తెలుగు సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. కాగా ప్రస్తుతం మాత్రం ఈ హీరోయిన్ టాలీవుడ్ కి.. దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి. 

1 /6

‘ప్రార్థన…ప్రతి రూపాయి కౌంట్.. ఇక్కడ’ అనే డైలాగ్ తో తెగ ఫేమస్ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్.. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. 

2 /6

ఇక ఆ తర్వాత నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. కానీ అనుకున్న రేంజ్ లో ఆ తరువాత.. రకుల్ కి మంచి విజయాలు రాలేకపోయాయి. దాంతో తన అదృష్టాన్ని హిందీ సినిమాల్లో ప్రయత్నించింది రకుల్. 

3 /6

అక్కడ మొదటి సినిమానే అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోతో చేసింది. అయినా కానీ పెద్దగా లాభం లేకుండా పోయింది. తెలుగులో జరిగినట్టే హిందీలో కూడా.. మొదటి సినిమాతోనే పేరు వచ్చిన.. ఆ తరువాత విజయాలు మాత్రం రాలేదు. 

4 /6

కానీ హిందీలో అదృష్టం కొద్ది..అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. ఇక హిందీలో సెటిల్ అయినా ఈ భామ.. అక్కడే ఒక నిర్మాతను పెళ్లి చేసుకొని.. పర్సనల్ లైఫ్ పరంగా కూడా సెటిల్ అయిపోయింది. 

5 /6

తెలుగు సినిమాలకు దూరమై మాత్రం చాలా రోజులు కావస్తోంది. మరి తొందరలో ఈ హీరోయిన్ ఏదన్నా తెలుగు సినిమా చేసందేహం లేదా.. అనేది చాలామందికి ఉన్న సందేహం. ఇక ఈ మధ్యనే ఇండియన్ 2 చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది.

6 /6

సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తెగ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ.. తన అభిమానులను తన అందంతో ఆకట్టుకోవడమే కాకుండా.. రకుల్ ఫేస్ లో ఎందుకు చాలా చేంజ్ వచ్చింది అని ఆశ్చర్యపరుస్తోంది కూడా.