Extra Pension Benefits: పెన్షనర్లకు కళ్లు చెదిరే గుడ్‌న్యూస్, కీలక మార్పులు, వయస్సు దాటితే అదనపు పెన్షన్

7th Pay Commission Pension Benefits: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్. 3 నుంచి 7వ వేతన సంఘం వరకూ అన్నింటిలో పెన్షన్ల పెంపు లేదా అదనపు పెన్షన్ ప్రయోజనాలు గురించి ఉంది. నిర్ణీత వయస్సు దాటిన సీనియర్ పెన్షనర్లకు వయస్సుని బట్టి పెన్షన్ అందనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

7th Pay Commission Pension Benefits: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వం కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షనర్లకు అందించే సౌకర్యాలు, ప్రయోజనాల ప్రక్రియను మరింత సులభతరం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. పెన్షన్‌తో పాటు గ్రాట్యుటీ ప్రయోజనాల విషయంలో కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. 

1 /5

2019లో పెన్షన్ అదాలత్ 5,277 కేసులు చేపట్టగా అందులో 3,573 కేసులు పరిష్కరించింది. అంటే 67 శాతం సక్సెస్ రేటు సాధించింది. 

2 /5

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల దీర్ఘకాలిక ఫిర్యాదులను సకాలంలో పూర్తిగా పరిష్కరించేందుకు పెన్షన్ అదాలత్ ఉంది. 2019లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి పెన్షనర్ల ఫిర్యాదులు క్రమంగా తగ్గుతున్నాయి. 

3 /5

80-85 ఏళ్ల వయస్సు కలిగినవారికి ప్రాధమిక పెన్షన్‌లో 20 శాతం, 85-90 ఏళ్లుంటే ప్రాధమిక పెన్షన్‌లో 30 శాతం, 90-95 ఏళ్ల వయస్సు కలిగితే ప్రాధమిక పెన్షన్‌లో 40 సాతం, 95-100 ఏళ్లుంటే ప్రాధమిక పెన్షన్ నుంచి 50 శాతం, 100 ఏళ్లు అతకంటే ఎక్కువ ఉంటే ప్రాధమిక పెన్షన్ నుంచి 100 శాతం అదనంగా లభిస్తుంది. 

4 /5

పెన్షనర్లకు ఆర్ధికంగా మరింత సెక్యూర్ చేసేందుకు పెన్షన్లు, కుటుంబ పెన్షన్లలో మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న వివిధ వేతన సంఘాల సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాురు. వివిధ పే రివిజన్ కమీషన్లలో ఈ విషయాన్ని చర్చించారు. ఇది వయస్సుని బట్టి ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ అదనపు పెన్షన్ పెరగనుంది

5 /5

3వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘం వరకూ పెన్షనర్లకు సంస్కరణలు, అదనపు పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.