Aadi Amavasya 2024: ఆగస్టులో శక్తివంతమైన ఆది అమావాస్య.. ఈ రోజు ఏం చేయాలంటే?

Aadi Amavasya 2024 In Telugu: హిందూ పురాణాల ప్రకారం, అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది ఈ అమావాస్య రోజున పతృదేవతలను పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఇలాంటి రోజు వారిని పూజించడం వల్ల జీవితంలో వస్తున్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా పితృదేవతల మోక్షం కూడా లభిస్తుంది.

1 /8

ఈ సంవత్సరం ఆగస్టు నెలలోని ఎంతో ప్రత్యేకత కలిగిన ఆది అమావాస్య కూడా రాబోతోంది. ఈ నెలలోని నాలుగవ రోజు ఈ  అమావాస్య రాబోతోంది. అయితే హిందూ పురాణాల ప్రకారం దీనికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది.   

2 /8

ఆది అమావాస్య రోజున సూర్య గ్రహ కదలికల కారణంగా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా విష్ణువు యోగ నిద్రలోకి కూడా వెళ్తాడు. దీంతో ఈ సమయంలో చాలా మంది అమ్మవార్లను పూజిస్తారు. 

3 /8

ఆది మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక, కెరీర్‌కి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.   

4 /8

ఈ సమయంలో శివారాధనకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. ఉత్తర భారత్‌లో జీవించే చాలా మంది హిందువులు ఈ సమయంలో నది స్నానాలు చేసి శివుడిని పూజిస్తారు.   

5 /8

అలాగే ఈ సమయంలో చాలా మంది నది స్నానాలు చేసి, పూర్వీకులకు ప్రత్యేకమైన పూజలు చేసి పిండ ప్రధానం చేస్తారు. అంతేకాకుండా గంగా పూజ కూడా చేస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

6 /8

ఎవరైనా చనిపోయిన వారికి ఈ ఆది అమవాస్య రోజున ప్రత్యేకమైన తిథిని నిర్వహించడం వల్ల ఆత్మలు కూడా శాంతిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. 

7 /8

ఆది అమావాస్య రోజున మరిణించిన పెద్దలకు నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని హిందువు నమ్మకం.   

8 /8

పితృదేవతల అనుగ్రహం పొందడానికి చాలా మంది ఈ ఆది అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి.