Numerology: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే ..దంపతుల మధ్య గొడవలు ఖాయం..!!

Danger Marriage Dates: పెళ్లి..ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన సంఘటన. శుభ ముహూర్తం ఉంటేనే పెళ్లి నిశ్చయిస్తారు పురోహితులు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకుంటే..ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందట. మరి ఆ తేదీలేవో తెలుసుకుందామా? 
 

1 /11

Unlucky Dates: పెళ్లి స్వర్గంలోనే నిశ్చయమవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసిన పెళ్లిజరగవు. కొన్ని సార్లు అనుకోని అవాంఛిత సంఘటనలు జరుగుతుంటాయి. పెళ్లి అనేది చాలా ముఖ్యమైన సంఘటన కాబట్టి సాధారణంగా  నిర్ణయించరు. దానికి తగిన రోజు, మహుర్తం చూస్తారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా  చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పురోహితులు. 

2 /11

అయితే వేద జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం రెండూ వివాహ తేదీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ప్రతీకాత్మకంగా సూచిస్తున్నాయి. కొన్ని సార్లు  తప్పుడు తేదీల్లో పెళ్లి చేసుకున్న జంటలు పెళ్లయిన కొద్ది రోజుల్లోనే వారి మధ్య గొడవలు షురూ అవుతాయి. చిన్న చిన్న మాటలకే గొడవపడుతుంటారు. విడాకులకు దారితీసే పరిస్థితులకు కూడా దారితీస్తాయి. అయితే ఏయే తేదీల్లో పెళ్లికి అరిష్టమో ఇప్పడు తెలుసుకుందాం. ముందుగా ఈ తేదీలు లేదా సంఖ్యలను లెక్కించాలి. వారి వివాహం జరిగిన తేదీ, నెల సంవత్సరాన్ని కలిపి, చివరగా వచ్చిన సంఖ్యను చూడండి. ఉదాహరణకు , మీ వివాహ తేదీ 12-07-1968 అయితే 1+2+0+7+1+9+6+8 = 34, ఈ 34కి 3, 4 కలిపితే 7 వస్తుంది. అది మీ సంఖ్య 7. కాబట్టి ఆ 9 సంఖ్యలను లెక్కిద్దాం.

3 /11

సంఖ్య 1: నెంబర్ వన్ తేదీలో పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగాఉంటారు. వారి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ఎలాంటి  సమస్యలు ఉండవు.   

4 /11

సంఖ్య 2:2వ సంఖ్యలో వివాహం చేసుకున్న దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎలాంటి సానుకూల ఫలితాలను చూడరు. వారికి ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాము, ముంగీస లా కొట్టుకుంటారు.   

5 /11

సంఖ్య 3: 3వ సంఖ్య వచ్చిన తేదీలో పెళ్లి చేసుకున్న దంపతుల్లో గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది. అందుకే పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని జ్యోతిష్యం చెబుతోంది.   

6 /11

సంఖ్య 4: 4వ సంఖ్య వచ్చే తేదీల్లో పెళ్లి చేసుకున్న జంటలు గర్భధారణ సమయంలో బిడ్డను కోల్పోయే అవకాశం ఉంది. దంపతులు తమ జీవితంలో ఎంత కష్టపడినా మంచి మార్గంలో  ఉండలేపోతారు.    

7 /11

సంఖ్య 5: 5వ తేదీన 14 లేదా 23వ తేదీల్లో వివాహం చేసుకున్న జంటలకు సంతాన సమస్యలు ఎదురవుతాయి. కొంతమందికి పిల్లలు పుట్టరు. పుట్టినా ఆడపిల్లలే, లేదా మగపిల్లలు పుట్టినా మొద్దుబారిపోతారు.కానీ ఆడపిల్లలు మాత్రం ఆ దంపతులకు ఆనందాన్ని ఇస్తారు.   

8 /11

సంఖ్య 6: ఆరవ సంఖ్యలో వివాహం చేసుకున్న జంటలు మొదట్లో పేదవారైనప్పటికీ, వివాహానంతరం వారి జీవితాల్లో ఉన్నతంగా బతుకుతారు. 

9 /11

సంఖ్య 7: ఈ తేదీల్లో 7 లేదా 16 లేదా 25 తేదీల్లో వివాహం చేసుకున్న జంటలు విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని న్యూమరాలజీ చెబుతోంది.ఈ తారీఖున పెళ్లయిన వారి జీవితాల్లో కొడుకులు పుట్టినా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  

10 /11

సంఖ్య 8: ఎనిమిదవ గణంలో వివాహం చేసుకున్న వారికి వివాహంలో వారి జీవితంలో సమస్యలు ఉండవు. పిల్లల విషయంలో సమస్యలు తప్పవు.    

11 /11

సంఖ్య 9:  9, 18 తేదీల్లో పెళ్లి చేసుకున్న దంపతులకు వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గొడవలు వచ్చిన పరిష్కరించుకుంటారు. 9అనే సంఖ్య ఉన్న వ్యక్తులకు వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది.ఇలా శాస్త్రాల ప్రకారం వివాహ తేదీలు మాత్రమే కాకుండా లగ్న భావాలు కూడా ఆ సందర్భంలో తెలియకపోతే...వివాహ తేదీని సరిగ్గా పరిశీలించి పెళ్లి తేదీని బట్టి వివాహ తేదీలు జరుగుతాయని చెబుతారు. వైవాహిక జీవితం సంతోషంగా, ప్రశాంతంగా కొనసాగుతుంది. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x