Camphor Remedy: కర్పూరం మనం పూజలో ఉపయోగిస్తాం. దీంతోనే పూజ పూర్తవుతుంది. కర్పూరంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. హెయిర్, బ్యూటీ రొటీన్‌లో కూడా కర్పూరాన్ని వినియోగిస్తారు. అయితే, వాస్తు ప్రకారం కర్పూరం ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
కర్పూరం నుంచి మంచి అరోమా వస్తుంది. ముఖ్యంగా ఇది మంచి స్ట్రెస్ రిలీఫ్‌గా కూడా పనిచేస్తుంది. కర్పూరం ఇంట్లో ఓ మూడు ప్రదేశాల్లో పెడితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఎక్కడెక్కడ కర్పూరం పెడితే ఇంటికి మంచిదో తెలుసుకుదాం.
పూజగదిలో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటాం. అక్కడే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అయితే, వాస్తు ప్రకారం పూజగదిలో కర్పూరం పెడితే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
వాస్తు ప్రకారం కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కూడా కట్టాలి. లేకపోతే ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూలత ప్రసరిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది. ఆ ఇంట్లో సుఖఃసంతోషాలు వెల్లి విరుస్తాయి.
అలాగే కర్పూరాన్ని ఇంట్లో డబ్బులు దాచిపెట్టే ప్రదేశంలో పెట్టుకోవాలి. కర్పూరం ఇంటి అల్మైరాలో డబ్బులు దాచిపెట్టే ప్రదేశంలో పెట్టడం వల్ల ధనప్రవాహం పెరుగుతుంది. అప్పుల ఊబి నుంచి కూడా త్వరగా బయట పడతారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)