Chandrika Ravi: బాలయ్య భామ రేర్ ఫీట్.. తొలి ఇండియన్ నటిగా..!

Chandrika Ravi Movies: ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ మూవీతో తన యాక్టింగ్‌తో మెప్పించిన నటి చంద్రికా రవి.. తెలుగులో వీరసింహా రెడ్డి మూవీలో తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఈ భామ ఇప్పుడు రేర్ ఫీట్ సాధించారు. అమెరికన్ రేడియో టాక్ షోను హోస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
 

1 /6

భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి..  ఈ టాక్ షో ద్వారా తన జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను పంచుకోనున్నారు.   

2 /6

రుకుస్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్.. ఈ బ్యూటీకి హోస్ట్‌గా ఆఫర్ ఇచ్చారు.  

3 /6

తనకు సొంతంగా ఓ టాక్ షో నిర్వహించాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని.. ఇప్పుడు నెరవేరిందన్నారు చంద్రికా రవి. ఆమె ఈ కార్యక్రమం ప్రతి అంశంతో పాటు దాని రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  

4 /6

ఇది ఒక గొప్ప అనుభవం అని.. కొంచెం ఒత్తిడి ఉన్నా కానీ లాభదాయకంగా ఉందని చంద్రికా రవి అన్నారు. కెమెరా వెనుక నుంచి పనిచేయడం భిన్నంగా ఉందన్నారు.  

5 /6

సినీ కెరీర్ ఆరంభించకముందు ఆమె రేడియో, టెలివిజన్‌లో అనేక లైవ్ షోలను హోస్ట్ చేసింది. యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేసిన మొదటి భారతీయ మహిళ అని తాను కావచ్చని.. కానీ తానే చివర కాదని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

6 /6

చంద్రిక షో యూఎస్‌లోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన iHeart రేడియో, రుకస్ అవెన్యూ రేడియోలో ప్రతి గురువారం ఉదయం 7:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రసారం అవుతోంది. ఫుల్ ఎపిసోడ్ ప్రతి శుక్రవారం యూట్యూబ్‌లో రిలీజ్ అవుతుంది.