Mohan Babu Family Controversy: మోహన్ బాబు జల్‌పల్లి ఫాంహౌజ్ పిక్స్ చూశారా.. రాజభవనాన్ని తలదన్నేలా..!

Mohan Babu Jalpally Farm House Pics: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఘర్షణ.. మధ్యలో మీడియా ప్రతినిధులపై దాడి.. హైబీపీతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలు అన్నింటికి కేంద్రంగా నిలిచింది జల్‌పల్లి ఫామ్‌ హౌస్. దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం.. అన్ని హంగులతో నిర్మించినట్లు తెలుస్తోంది.
 

1 /7

మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. జల్‌పల్లి ఫామ్‌హౌస్‌ నుంచి మనోజ్‌ను మోహన్ బాబుకు బయటకు పంపించేయడంతో మంగళవారం అంతా అక్కడ హైడ్రామా నడిచింది.  

2 /7

అక్కడ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అనుచరులు దురుసుగా ప్రవర్తించడం.. ఓ ఛానెల్ లోగోను తీసుకుని మోహన్ బాబు దాడికి పాల్పడడం కలకలం రేపింది.  

3 /7

కెమెరాల లాక్కుని.. ఫామ్‌హౌజ్‌లోకి లోపలికి వచ్చిన మీడియా సిబ్బందిని తన బౌన్సర్లతో బయటకు తోయించేశారు.   

4 /7

ఈ క్రమంలో హైబీపీతో మోహన్ బాబు మంగళవారం రాత్రి కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.   

5 /7

అంతకు ముందు  మంచు మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా.. వారిని లోపలికి రానివ్వలేదు. లోపల తన కూతురు ఉందని గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు.   

6 /7

వాళ్లు ఎంతకూ గేట్లు తీయకపోవటంతో తన బౌన్సర్లతో కలిసి గేటును తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. లోపల మనోజ్‌కు, మోహన్ బాబుకు తోపులాట జరగ్గా.. మోహన్ బాబు ఫ్రస్టేషన్‌లో మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.  

7 /7

మోహన్ బాబు దాడి ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.