Telugu Movie Gossips: కెరీర్‌ ఊపు మీద ఉన్నప్పుడే బిలినీయర్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆ వ్యాపారవేత్త ఆస్తి విలువ ఎంతో తెలుసా..!

Actress Juhi Chawla: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు సెలబ్రిటీ గ్యాలరీలో ఓ నటి ఎప్పుడు సందడి చేస్తున్నప్పుడు కనిపిస్తుంటుంది. మీరూ గమనించే ఉంటారు. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా. ఆమె భర్త జే మెహతా కేకేఆర్ టీమ్‌కు సహ యాజమాని. ఈ విషయం చాలామందికి తెలియదు. 

1 /6

జుహీ చావ్లా 90లలో స్టార్‌ హీరోయిన్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. మెరిసే కళ్లు, మనోహరమైన చిరునవ్వుతో అభిమానులను అలరించింది.  

2 /6

బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్, రిషి కపూర్, గోవిందా వంటి బడా హీరోలతో కలిసి సినిమాల్లో నటించింది.  

3 /6

జుహీ చావ్లా 1995లో తన కెరీర్‌ టాప్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త జే మెహతాను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు జాహ్నవి, అర్జున్ ఉన్నారు.  

4 /6

జే మెహతాకు అప్పటికే వివాహం అవ్వగా.. మొదటి భార్య సుజాత బిర్లా ప్రమాదంలో మరణించింది. మల్టీ నేషనల్ కంపెనీ గ్రూప్ ‘ది మెహతా గ్రూప్’ సంస్థకు ఆయన వ్యవస్థాపకుడు. ఈ సంస్థకు ఆఫ్రికా, భారత్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ తదితర దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి.  

5 /6

‘ది మెహతా గ్రూప్’ కంపెనీ విలువ 500 మిలియన్ US డాలర్లు అంటే దాదాపు 4162 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 15 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  

6 /6

కేకేఆర్‌ టీమ్‌కు సహ యాజమని అయిన జే మోహతాకు సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ , గుజరాత్ సిద్ధి సిమెంట్ లిమిటెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి.