Krithi Shetty: అర్ధరాత్రి ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నాడు..తెలుగు స్టార్ హీరోపై బేబమ్మ కామెంట్స్..!

Krithi Shetty controversy: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ అందుకుంది బేబమ్మ. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు.. కూడా ఈ హీరోయిన్ కి మంచి విజయం అందించడంతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు అందుకుంది. కానీ ఆ తర్వాత నుంచి వరుస ఫ్లాప్స్ సొంతమయ్యాయి. కాగా ఈ హీరోయిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

కన్నడ ఇండస్ట్రీ కి చెందిన కృతి శెట్టి..అక్కడ యాడ్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకొని , ఆ తర్వాత తెలుగులో ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా..దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.   

2 /5

ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి , అతి తక్కువ సమయంలో ఊహించని ఇమేజ్ దక్కించుకుందని చెప్పవచ్చు.   

3 /5

అంతేకాదు ఈ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి డెబ్యూ హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దీంతో పాటు మరెన్నో అవార్డులు లభించాయి. ఈ ఒక్క సినిమా ఆమెకు భారీ ఇమేజ్ ను  అందించింది. దీనికి తోడు కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలలో కూడా నటించి హ్యాట్రిక్ అందుకుంది.  అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎంపిక విషయంలో కాస్త వెనుకబడిన కృతి శెట్టి వరుస.. డిజాస్టర్లు చవి చూసింది. దీంతో టాలీవుడ్ లో ఫేడౌట్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. 

4 /5

ఇక చివరిగా కస్టడీ, మనమే వంటి చిత్రాలలో నటించినా పెద్దగా ఈమెకు గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు కోలీవుడ్లో అవకాశం అందుకున్నట్లు వార్తలు రాగా.. మరొకవైపు మరో టాలీవుడ్ యంగ్ హీరోకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఎక్కువగా ఉందంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను కూడా ఒక స్టార్ హీరో కారణంగా చిత్రవధకు.. గురి అవుతున్నాను అంటూ ఆమె తెలిపినట్లు సమాచారం.   

5 /5

టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు కృతి శెట్టికి అర్థరాత్రి టైమ్.. లో ఫోన్ చేసి విసిగిస్తున్నారట. ఈమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పదేపదే చేస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. ఇక అతడి నెంబర్ గుర్తుపట్టి లిఫ్ట్ చేయకపోవడం వల్లే వేరే నంబర్స్ నుంచి ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కృతి శెట్టి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.