Bajaj Pulsar N125 Price: శక్తివంతమైన 124.53 cc ఇంజన్‌ Bajaj Pulsar N125 బైక్‌ అతి తక్కువ ధరకే.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!

Bajaj Pulsar N125 Price: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే అద్భుతమైన స్పోర్ట్స్‌ బైక్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బజాజ్‌ ఇటీవలే మార్కెట్‌లోకి తీసుకు వచ్చిన ఓ మోటార్‌సైకిల్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇది అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇంతకీ ఈ బైక్‌ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /5

ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన బజాజ్ పల్సర్ N125 బైక్‌ ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది చూడడానికి అచ్చం స్పోర్ట్స్ బైక్‌ లాగే కనిపిస్తుంది. దీనిని కంపెనీ స్పోర్ట్స్‌ మోటర్‌ సైకిల్‌ను దృష్టిలో పెట్టుకునే విడుదల చేసినట్లు ప్రకటించింది.  

2 /5

బజాజ్ పల్సర్ N125 మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ బైక్‌లో  స్పీడోమీటర్‌తో పాటు ఆటో మీటర్, ట్రిప్ మీటర్ వంటి ప్రత్యేకమైన కొత్త టెక్నాలజీతో విడుదలైంది. అలాగే ఈ మోటర్‌ సైకిల్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి.   

3 /5

బజాజ్ పల్సర్ N125 మోటార్‌సైకిల్‌లో డబుల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే మొబైల్‌ను ఛార్జ్‌ చేసేందుకు ఈ బైక్‌లో ప్రత్యేకమైన ఛార్జింగ్‌ పోర్ట్‌ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన కంట్రోల్‌ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి.   

4 /5

ఈ బజాజ్ పల్సర్ N125 మోటర్‌ సైకిల్ 124.53 cc ఇంజన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది సింగిల్-ఛానల్ ABSతో వస్తోంది. ఇక ఈ బైక్‌కి సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే.. ఇది లీటర్‌కి దాదాపు 59 కిమీ మైలేజీని అందిస్తుంది.  

5 /5

ఈ మోటర్‌ సైకిల్‌ ప్రత్యేకమైన కొత్త గేర్‌బాక్స్ సెటప్‌తో విడుదలైంది. ఇక ఈ బైక్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. రూ.1.12 లక్షల నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ అందుబాటులో ఉన్నాయి.