Lavanya Tripathi Photos: అందాల రాక్షసి మూవీతో తెరంగేట్రం చేసి.. తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది లావణ్య త్రిపాఠి. అందులో అమాయకంగా 'నాన్న.. నాకు పెళ్లి చేసేయండి' అంటూ క్యూట్‌గా ఆమె చెప్పిన డైలాగ్ ఓ రేంజ్లో పేలింది. ఆ మూవీ అల్లరి పిల్లగా లావణ్య నటన అందరికీ తెగ నచ్చేసింది.
ఈ ముద్దుగుమ్మ అయోధ్యలో పుట్టింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం విన్ అయింది.
అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఈ బ్యూటీకి టాలీవుడ్లో మంచి ఆఫర్లే వచ్చినా.. ఊహించినంత స్టార్డమ్ అయితే రాలేదు.
చివరగా లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన హ్యాపీ బర్త్ డే మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
ప్రస్తుతం కథలు ఎంచుకునే పనిలో ఉండగా.. సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.