పెళ్లయిన నటుడితో నటి ఎఫైర్.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి.. ఆ స్టార్ హీరోయిన్‌ ఎవరంటే..?

Pushpavalli Gemini Ganesan Love Story: సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు టాప్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగిన వారు ఎందరో ఉన్నారు. హేమ మాలిని, రేఖ, వైజయంతి మాల, జయప్రద, శ్రీదేవి ఇలా చాలా మంది హీరోయిన్స్‌ బాలీవుడ్ కంటే ముందు దక్షిణాది సినిమాల్లో రాణించారు. నటి రేఖ తల్లి పుష్ఫవల్లి కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

1 /6

అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ సూపర్ స్టార్‌తో పుష్పవల్లి ప్రేమలో ఉండి.. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు పుష్పవల్లి. ఆ ఇద్దరిలో నటి రేఖ ఒకరు.  

2 /6

రేఖ తల్లి పుష్పవల్లి తమిళంతోపాటు తెలుగులోనూ నటించారు. వెండితెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. 1936లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆమె రూ.300 రెమ్యూనరేషన్ తీసుకున్నారు.  

3 /6

ఈ సినిమా హిట్‌తో పుష్పవల్లికి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె సినిమాల కంటే వ్యక్తిగతం జీవితంగా కారణాంగానే ఎక్కువగా వార్తల్లోకి ఎక్కారు. 1940లో వివాహం జరగ్గా.. ఆరేళ్ల తరువాత భర్త నుంచి విడిపోయింది.  

4 /6

హీరో జెమినీ గణేషన్‌తో ‘మిస్‌ మాలిని’ అనే సినిమాలో పుష్పవల్లి  హీరోయిన్‌గా నటించింది. ఇక్కడి నుంచి ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. అప్పటికే పెళ్లి అయిన జెమినీ గణేషన్‌తో ఆమె ప్రేమలో పడిపోయింది.  

5 /6

పుష్ఫవల్లికి తన భార్య హోదాను ఎప్పుడు ఇవ్వలేదు జెమినీ గణేషన్. ఆమె వివాహం జరగకుండానే ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యారు. జీవితాంతం ఆయనకు ప్రేయసిగానే ఉండిపోయింది.  

6 /6

రేఖ తల్లి పుష్పవల్లి 1991లో కన్నుమూశారు. తనలాగే తన కూతురు రేఖా సినిమాల్లో రాణించాలని పుష్పవల్లి కోరుకున్నారు. రేఖ జీవితం కూడా ఒడిదుడుకులతో సాగింది. కీర్తి, సంపద ఉన్నా.. ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు.