Aishwarya-Abhishek: విడాకులు తీసుకుంటున్న స్టార్ జంట.. ఇదే సాక్ష్యం!

Aishwarya Rai Bachchan - Abhishek Bachchan Divorce: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల భారీ వివాహ వేడుకకి హాజరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్, బచ్చన్ కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దానికి కారణం వేడుక కి బచ్చన్ కుటుంబం కలిసి వచ్చినప్పటికీ, ఐశ్వర్య రాయ్ అందులో లేకపోవడం. 

1 /5

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకల్లో ఐశ్వర్య రాయ్, బచ్చన్ కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సాక్ష్యం కూడా దొరికేసింది. అంబాని ఇంట పెళ్లి వేడుకల్లో.. టాలీవుడ్ నుంచి కొందరు సెలబ్రిటీలు హాజరు కాగా.. బాలీవుడ్ లోని దాదాపు అందరూ సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో భాగంగా బచ్చన్ కుటుంబం కూడా వచ్చారు.

2 /5

ట్విస్ట్ ఏంటి అంటే ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్య తో పాటు వచ్చింది. మరోవైపు బచ్చన్ కుటుంబం మొత్తం కలిసి వచ్చారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కానీ ఐశ్వర్య, తన కూతురు ఆరాధ్య మాత్రం బచ్చన్ కుటుంబంతో కలిసి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 

3 /5

నిజానికి వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు.. అనే వార్త గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉంది. కానీ ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో.. అలాంటిదేమీ అయి ఉండదు అని.. అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడు ఐశ్వర్యారాయ్, బచ్చన్ కుటుంబం విడివిడిగా రావడంతో.. ఈ వార్తల్లో నిజం ఉందని నిరూపణ అయిపోయింది.. అని అభిమానులు బాధపడుతున్నారు. 

4 /5

ఈ వేడుకకి అమితాబ్ బచ్చన్ గోల్డెన్ వర్క్ ఉన్న క్రీం కలర్ షేర్వానీలో వచ్చారు. జయ గ్రే కలర్ చీరలో రాణి హారంతో మెరిసిపోయారు. శ్వేతా బచ్చన్, ఆమె కూతురు నవ్యా నవేలి కూడా.. ఈ వేడుకకు హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్ గోల్డెన్ కలర్ షేర్వానీలో కనిపించారు. శ్వేతా బచ్చన్ కూడా తన భర్త నిఖిల్ నంద తో కలిసి వచ్చారు.

5 /5

మరోవైపు ఐశ్వర్యారాయ్ ఎరుపు రంగు లెహంగాలో కనిపించగా, ఆరాధ్య గ్రీన్ కలర్ సూట్ లో వచ్చింది. ఇద్దరు కలిసి ఫోటోలకి పోజ్ ఇచ్చారు. మరోవైపు బచ్చన్ కుటుంబం ముందు వేడుకకి వచ్చేసిందని.. అక్కడి వారి ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఐశ్వర్యరాయ్ వచ్చింది అని.. అందుకే వాళ్ళు కలిసి కనిపించలేదు అని.. మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఎందులో నిజం ఉందో ఇంకా తెలియాల్సి ఉంది.