Alia Bhatt: ఏం తమాషాగా ఉందా..?.. ఎక్స్‌లో రెచ్చిపోయిన ఆలియాభట్.. అసలేం జరిగిందంటే..?

Alia bhat fires on bady shaming comments: బాలీవుడ్ నటి ఆలియాభట్ ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమెను కొంత మంది ట్రోలర్స్ టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.

1 /6

బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇటీవల జీగ్రా మూవీలో లో నటించారు.  ఆలియా, వేదాంగ్ రైనా లు కీరోల్ ప్లే చేశారు. అంతేకాకుండా..ఈ సినిమాకు.. వాసన్ బాలా ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు.  ఈ సినిమాకు మంచి రెస్పెన్స్ వస్తుందని తెలుస్తొంది.

2 /6

ఇదిలా ఉండగా జిగ్రా  భామకు కొన్నిరోజులుగా ట్రోలర్స్ చుక్కలు చూపిస్తున్నారు. ఆమె ఇటీవల బొటాక్స్ ట్రీట్మెంట్ చేసుకుని ముఖం అంతా పెరాలసిస్ కు గురైందని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకే ఆమె పబ్లిక్ లో ఎక్కువగా రావడంలేదని పుకార్లు వైరల్ చేస్తున్నారు.

3 /6

మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని, జిగ్రా మూవీ రిలీజ్ వేడుకల్లో ఆమె ముఖం కాస్తంత భిన్నంగా కన్పించిందని కూడా రూమర్స్ వ్యాప్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా, దీనిపై నటి ఆలియాభట్ స్పందించారు.

4 /6

కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు చూసి ఆలియా భట్ కోపంతో రగిలిపోయినట్లు తెలుస్తొంది. ఆమె ఏకంగా ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అర్థం పర్థంలేని రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. 

5 /6

మీకు పనిపాట లేదా.. అంటూ ట్రోలర్స్ పై మండిపడ్డారు. నాకు పెరాలసిస్ ఎఫెక్ట్ అయ్యిందని, బాడీ షేమింగ్ కు సంబంధించిన రూమర్స్ వైరల్ చేస్తున్నారు.. మీరు ఏమైన వచ్చి చూశారా.. అని తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఆలియాభట్ చేసిన పోస్ట్ కాస్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

6 /6

 కొంత మంది పనిగట్టుకుని ఇటీవల ఫెమస్ పర్సనాలీటీస్ లపై లేని పోనీ రూమర్స్ వ్యాప్తి చేస్తు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే చాలా మంది ఫెమస్ నటీ,నటులు సైతం ఈ ట్రోలర్స్ బారినపడి తరచుగా వార్తలలో ఉంటునే ఉంటారు. వీరిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని కూడా బాలీవుడ్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x