Amazon Upgrade Days Sales Offers: స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీలపై అమెజాన్‌లో భారీగా ఆఫర్లు, ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వేదిక అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో ఉన్న ఆ భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.

Amazon Upgrade Days Sales Offers: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వేదిక అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో ఉన్న ఆ భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

Oneplus 9R 5G వన్‌ప్లస్ కంపెనీకు చెందిన ఈ 5జి స్మార్ట్‌ఫోన్‌పై మీకు 3 వేల రూపాయల కూపన్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 39 వేల 999 రూపాయలకు బదులు 36 వేల 999 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 14 వేల 950 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు.

2 /5

Redmi Tv HD Ready Smart LED Tv రెడ్ మి కంపెనీకు చెందిన ఈ 32 ఆంగుళాల స్మార్ట్‌‌టీవీ అసలు ధర 24 వేల 999 రూపాయలు కాగా, 15 వేల 999 రూపాయలకే లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 2 వేల 410 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇతర బ్యాంకులు కూడా కొన్ని ఆఫర్లు అందిస్తున్నాయి.

3 /5

Samsung Galaxy M12 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ వాస్తవ ధర 15 వేల 499 రూపాయలు కాగా, అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో 13 వేల 499 రూపాయలకే అందుతుంది. ఎక్చ్సేంజ్ ఆఫర్‌లో 12 వేల 750 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. హెచ్ఎస్‌బీసీ కార్డు ద్వారా 675 రూపాయలు క్యాష్‌బ్యాక్ అందుతాయి. అంటే కేవలం 74 రూపాయలకే ఈ ఫోన్ దక్కించుకోవచ్చు మీరు. 

4 /5

Oneplus Y Series Smart Tv వన్‌ప్లస్ కంపెనీకు చెందిన ఈ 43 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ అసలు ధర 29 వేల 999 రూపాయలు కాగా, అమెజాన్ సేల్‌లో భాగంగా 25 వేల 999 రూపాయలకు లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ మిల్లీనియం క్రెడిట్ కార్డు, హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో 13 వందల రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 

5 /5

Redmi Note 11T 5G రెడ్ మి కంపెనీకు చెందిన 5జి స్మార్ట్‌ఫోన్ 20 వేల 999 రూపాయలకు బదులు అమెజాన్‌లో 17 వేల 999 రూపాయలకే లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో తీసుకుంటే కేవలం 14 వేల 950 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఈ డీల్‌లో ఇతరత్రా చాలా బ్యాంకులు ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.