Anant ambani radhika wedding: అనంత్ అంబానీ- రాధికా వెడ్డింగ్.. అతిథులకు కరీంనగర్ నుంచి స్పెషల్ బహుమతులు.. డిటెయిల్స్ ఇవే..

karimnagar filigree gifts: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లికి కరీంనగర్ నుంచి ఫిలీగ్రీ ఉత్పత్తుల కోసం ఆర్డర్ లు ఇచ్చినట్లు తెలుస్తొంది. పెళ్లి వేడుకకు హజరయ్యే అతిథుల కోసం ప్రత్యేకంగా కొన్ని ఉత్పత్తులను చేయిస్తున్నారని తెలుస్తొంది.

1 /7

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ, నీతా దంపలు కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే గత మే నెలలో ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ను అంబానీ కుటుంబం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. 

2 /7

మరోవైపు.. రాధిక తన చిన్న నాటి స్నేహితురాలిని, అనంత్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలసిందే. దాదాపు వీరు ఎంగెజ్ మెంట్ లో  వందల రకాల ఫుడ్ మెనూను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. దాదాపు 300 కోట్ల వరకు కూడా ఖర్చు అయినట్లు సమాచారం.

3 /7

ఇక జులై 12 న అనంత్ , రాధిక ల పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి మన దేశం నుంచి మాత్రమే కాకుండా, విదేశాల నుంచి కూడా అతిరథ మహారథులు వస్తున్నారు. ఇప్పటికే వీవీఐపీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. 

4 /7

ఈ క్రమంలో అతిథులకు గిఫ్ట్ ల విషయంలో అంబానీ కుటుంబం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తెలంగాణలోకి కరీంనగర్ పిలీగ్రీలతో తయారు చేసే వస్తువులకు ఎంతో ఫెమస్. అంబానీ ఫ్యామిలీ నుంచి దాదాపు 400 రకాల వెరైటీ పిలీగ్రీ వస్తువుల కోసం ఆర్డర్ లు వచ్చినట్లు తెలుస్తోంది.

5 /7

ముకేష్ అంబానీ కుటుంబం అనంత్, రాధికల పెళ్లి అందరు గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తొంది. దీని కోసం మన దేశంతొ పాటు, విదేశాల నుంచి ప్రత్యేక గిఫ్ట్ లను తెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఫిలీగ్రీ వస్తులువులు మరోసారి వార్తలలో నిలిచింది.

6 /7

ఈ నేపథ్యంలో.. దాదాపు 400 వస్తువులకు ఆర్డర్‌ చేసినట్లు కరీంనగర్‌ ఫిలిగ్రీ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్‌లు తెలిపారు. జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్‌ బౌల్స్, తదితర వస్తువుల కోసం అంబానీ కుటుంబం ఆర్డర్‌ ఇచ్చినట్లు వెల్లడించారు.

7 /7

ఇదిలా ఉండగా.. గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు. అంబానీ పెళ్లి ఆర్డర్ తో మరోసారి కరీంనగర్ ఫిలీగ్రీ వస్తువులు వార్తలలో నిలిచాయి.